బిగ్ బాస్ ఫేమ్ వాసంతి కృష్ణన్ పెళ్లి పీటలెక్కింది. తెలుగు బిగ్ బాస్ సీజన్ 6తో ఎంతో ఫేమస్ అయిన వాసంతి పలు సీరియల్స్ లో నటిస్తూ వస్తోంది. సీరియల్స్ ద్వారా ఆమె ఇప్పటికే ఎంతో మంది బుల్లితెర అభిమానులను సొంతం చేసుకుంది. తాజాగా ఆమె తన ప్రియుడు వపన్‌ను వివాహమాడింది. పవన్ కల్యాణ్‌ను పెళ్లి చేసుకున్న వాసంతికి సినీ ప్రముఖులు సైతం శుభాకాంక్షలు చెప్పారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 6తో ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న వాసంతి కృష్ణన్ ఇప్పుడు సీరియల్స్‌తో పాటుగా సినిమాల్లోనూ నటిస్తోంది. సిరిసిరి మువ్వలు సీరియల్‌తో ఆమె బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత గోరింటాకు, గుప్పెడంత మనసు సీరియల్స్‌లో నటించింది. ఇకపోతే కాలీఫ్లవర్, మనే నం.67, భువన విజయం, సీఎస్ఐ సనాతన్ లాంటి ఎన్నో సినిమాల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించింది. తెలుగు మాత్రమే కాకుండా కన్నడ చిత్ర పరిశ్రమలోనూ పలు సినిమాల్లో మెరిసింది. ప్రస్తుతం వాసంతి భర్త పవన్ రెండు సినిమాల్లో నటిస్తున్నాడు.