Wednesday, February 18, 2026

Creating liberating content

తాజా వార్తలుసినీ నటి హేమ కోసం హైదరాబాద్‌కు చేరుకున్న బెంగళూరు పోలీసులు

సినీ నటి హేమ కోసం హైదరాబాద్‌కు చేరుకున్న బెంగళూరు పోలీసులు

సినీ నటి హేమ కోసం బెంగళూరు సీసీబీ పోలీసులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. సీసీబీ పోలీసులు ఆమెకు ఇప్పటికే రెండుసార్లు నోటీసులు జారీ చేశారు. బెంగళూరులో తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ ఆమె విచారణకు హాజరుకాలేదు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకోవడానికి సీసీబీ పోలీసులు ఈరోజు హైదరాబాద్ వచ్చారు.నటి హేమ మే 20న బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్నారు. ఆమె రక్తనమూనాలో డ్రగ్స్ పాజిటివ్‌ను గుర్తించారు. దీంతో విచారణకు రావాలని హేమతో పాటు… రేవ్ పార్టీలో పాల్గొన్న పలువురికి నోటీసులు ఇచ్చారు. మొదటిసారి గత సోమవారం విచారణకు హాజరు కావాలని, రెండోసారి జూన్ 1న విచారణకు హాజరు కావాలని హేమకు నోటీసులు ఇచ్చారు. కానీ ఆమె సీసీబీ పోలీసుల ఎదుట విచారణకు హాజరుకాలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article