కనిగిరి :ఆంధ్ర రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వర్యులు ఆనం రామనారాయణ రెడ్డిని శనివారం ఉదయం కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్, పామూరు సింగిల్ విండో మాజీ అధ్యక్షులు బైరెడ్డి జయరామిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పట్టు వస్త్రంతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా బైరెడ్డి, దారపనేని మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఆనం రామనారాయణ రెడ్డి రోడ్లు, భవనాలు శాఖ మంత్రివర్యులుగా, పర్యాటక శాఖ మంత్రివర్యులుగా, ఆర్థిక శాఖ మంత్రివర్యులుగా రాష్ట్రానికి విశిష్ట సేవలందించారని, రాష్ట్ర విభజన తరువాత దేవాదాయ శాఖ మంత్రివర్యులుగా బాధ్యతలు చేపట్టారని, నెల్లూరు జిల్లాలో క్రియాశీలక రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మకుటం లేని మహారాజు ఆనం రామనారాయణ రెడ్డి అని దారపనేని చంద్రశేఖర్, బైరెడ్డి జయరామిరెడ్డి కొనియాడారు.

