ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అతిశీ, రామాయణంలో భరతుడితో తనను పోల్చుకున్నారు. అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేసిన తర్వాత సీఎం బాధ్యతలు స్వీకరించిన ఆమె, ఈ సందర్భంలో కేజ్రీవాల్ పై తన భక్తిని చూపించారు. భరతుడు రాముడి తరఫున రాజ్యాన్ని పాలించినట్టు, తాను కేజ్రీవాల్ తరఫున ప్రధాన బాధ్యతలు చేపట్టానని చెప్పారు.అతిశీ మీడియాతో మాట్లాడుతూ, రాముడి వనవాసంలో భరతుడు రాజ్యాన్ని పాలించిన దృశ్యాన్ని ప్రస్తావించారు. కేజ్రీవాల్ మళ్లీ నాలుగు నెలల తర్వాత ఎన్నికల ద్వారా సీఎం పదవిని చేపడతారని తనకు విశ్వాసం ఉందని అన్నారు. కేజ్రీవాల్ కు పట్టం కడితే ఆయన తిరిగి తన కుర్చీలో కూర్చుంటారని చెప్పారు.