టి.నరసాపురం:మండలంలో ఉద్యోగం నుండి తొలగించిన ఆశ వర్కర్ లక్ష్మి మంగ ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షుడు కెవి రమణ డిమాండ్ చేశారు
భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐ ఎఫ్ టి యు ప్రగతిశీల మహిళా సంఘం పిఓడబ్ల్యు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పి డి ఎస్ యు ఆధ్వర్యంలోశనివారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఇఫ్టూ జిల్లా అధ్యక్షులు కెవి రమణ పి వో డబ్ల్యూ జిల్లా సహాయ కార్యదర్శి ఈమని మల్లిక పి డి ఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం మహర్షి లు మాట్లాడుతూ టీ నర్సాపురం మండలం గండిగూడెం గ్రామంలో పనిచేస్తున్న ఆశ వర్కర్ లక్ష్మి మంగ ను సరైన విచారణ లేకుండా ఉద్యోగం నుండి తొలగించడం దుర్మార్గమైన చర్యని విమర్శించారు ఆమె గ్రామాలలో విధులు సక్రమంగా నిర్వహిస్తున్నారని అక్కడ ఒక వ్యక్తి మానసికంగా శారీరకంగా వేధిస్తున్నారని ఆ వేధింపుని తట్టుకోలేక పై అధికారులకు ఫిర్యాదు చేసిందని ఆ విషయంపై కక్ష పెంచుకున్న సదరు వ్యక్తి రాజకీయ ఒత్తిళ్ళు తీసుకువచ్చి అధికారుల మీద ఒత్తిడి చేశారని ఆ అధికారులు సరైన విచారణ జరపకుండా అక్కడ గ్రామస్తులను కూడా విచారించకుండా ఆశా వర్కర్ లక్ష్మి మంగపైనే క్రమశిక్షణ చర్యలు తీసుకుని విధులు నుండి తోలగిస్తున్నట్లు ప్రకటించారని విమర్శించారు ఆశ అంగన్వాడీ వర్కర్లపై రాజకీయ పెత్తనాలను ఖండించాలని డిమాండ్ చేశారు విధుల నుండి తొలగించిన లక్ష్మీ మంగను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టి యు జిల్లా నాయకులు పి నాగేశ్వరరావు ,గ్రీష్మ కుమార్,
సి హెచ్ రమేష్ ,పి డి ఎస్ యు జిల్లా నాయకులు బన్నే వినోద్ తదితరులు పాల్గొన్నారు.