Thursday, February 19, 2026

Creating liberating content

తాజా వార్తలుమహారాష్ట్రలో ఎమ్ఐఎమ్ మాజీ మేయర్‌పై కాల్పులు

మహారాష్ట్రలో ఎమ్ఐఎమ్ మాజీ మేయర్‌పై కాల్పులు

మహారాష్ట్రలో ఎమ్ఐఎమ్ నేత, మాలేగావ్ మాజీ మేయర్ అబ్దుల్ మాలిక్‌పై ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు సోమవారం కాల్పులు జరిపి పారిపోయారు. ఈ ఘటనలో ఆయనకు గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మాలిక్ పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. నాశిక్ జిల్లా లో ఓల్డ్ ఆగ్రా రోడ్డులోని ఓ పెట్రోల్ బంక్‌కు సమీపంలోగల షాపు వద్ద మాజీ మేయర్ కూర్చుని ఉండగా ఈ ఘటన జరిగింది. అర్ధరాత్రి 1.20 గంటలకు బైక్ పై వచ్చిన నిందితులు మాజీ మేయర్ పై మూడు రౌండ్ల కాల్పులు జరిపి పారిపోయారు. మాలిక్ ఛాతి, కాలికి గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో గుర్తుతెలియని నిందితులపై పోలీసులు హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article