Sunday, September 14, 2025

Creating liberating content

తాజా వార్తలుకళామతల్లిని కళంకితం చేస్తున్నారా ..

కళామతల్లిని కళంకితం చేస్తున్నారా ..

రెండు వేలు ఇస్తే మూడుపాటలు పాడొచ్చా
పాటలు పాడాలంటే పైసలివ్వాలా
పాటకు ప్రాణం పోస్తున్నారా తీసున్నారా…
అమ్మేవాడికోసమా గజమాల
గజమాల వేసుకోమన్నదెవరు..గోతులు తీయమన్నది ఎవరు…
గాత్రం లేకపోయిన గజమాల వేసుకుంటే సరిపోతుందా
శృతి లేకపోయిన శాలువా కప్పు కుంటే చాలా
ఇదేనా గానామృతం… వీరేనా గాన గంధర్వులు..
ఇంకెంత కాలం ఈ కారు కూతలు..
మరెంత కాలం మభ్యపెట్టె మాటలు
ఇందుకేనా పీహెచ్డీ లు ఇచ్చేది…
పీహెచ్డీ కూడా పచ్చడి కూర అయిందా…
ఇందుకేనా పిచ్చి ప్రేలాపణలు..
ఇవన్నీ రిజిస్ట్రేషన్ సంస్థలు చేయొచ్చా…
గజమాల, శాలువా కప్పినా గిన్నిస్ బుక్ ఎక్కేస్తారా…
ఇలా చేసేనా వేల ప్రోగ్రాంలు అయింది…
ఇదేనా సింగర్ శైలజ చెప్పకనే చెప్పిన చిదంబర రహస్యం…
అయ్యా గానగంధర్వులు,ఛాలెంజ్ సింగర్స్ ఇప్పుడేమంటారో..

విజయవాడ:
అయ్యో…అయ్యోయ్యో ఈ గానగంధర్వులు, అభినవ బాలులు,చాలెంజ్ సింగర్స్ ,జాతీయ,అంతర్జాతీయ గాయనీ గాయకులు పాడుతున్న పాటలు,పడుతున్న పాట్లు,ఆడుతున్న ఆటలు చూస్తే కళామతల్లి కన్నీరు కార్చుతోంది అన్న అనుమానాలు, అవమానాలు వినిపిస్తున్నాయి. ఇందుకేనా కలల కోసమే దాతల సహాయం తో ప్రభుత్వము నిర్మించిన కౌతాపూర్ణానంద ధర్మసత్రం వారు కూడా వీరిని దూరం పెట్టి కరెంట్ కోతలు విధిస్తూ కళాకారులను నడిరోడ్డు పాలు చేస్తున్నది.ఈ మహా విద్వాంసులు, గాన గంధర్వులు, చాలెంజ్ సింగర్స్ ధాటికి స్థలం సరిపోక గొడవలు జరుగుతుంటే కౌతాపూర్ణానంద ధర్మసత్రం కూడా సరిపోక హనుమంతరాయ గ్రంధాలయంలో కూడా గొడవలు జరుగుతున్నాయని ఆ చెవులు ఈ చెవులు కోరుక్కుంటున్నాయని కొంతమంది చెప్పుకొస్తున్నారు. వీరి గాన మాధుర్యాన్ని చూసి పరవశించి పోయి పరుగులు తీస్తున్నారట ఎక్కడ వీరి గాణామృతం వినలేకపోతానేమోనని. సృష్ఠిలో అపారమైన గౌరవం ఒక్క కళాకారుడికే ఉంది.సృష్టి స్థితి లయ కారుడైన ఆదిశంకరుడిని కూడా మెప్పించి ఈ లోకాన్ని శాంతింప చేయగల సత్తా ఓ గాణానికే ఉంది.అలాంటి గానాన్ని కూడా గాత్రంతో పనిలేక పోయిన మనము గతంలో,వర్తమానం లో ఏదో ఉద్యోగం వెలగబెడుతున్నామని మనమే ఇక్కడ శాసిస్తున్నామని చెట్టుపేరు చెప్పి కాయలమ్ముకొనే వారిని అడ్డుగా పెట్టుకుని నీకింత నాకింత అంటూ ఒకరికొకరు పొగుడుకోని పేద కళాకారుల పొట్ట కొడుతుంటే కళామతల్లి పరువుతీస్తున్నారా అనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కళామతల్లి బిడ్డలు. పాట పాడటం ఓ వరం. పాటపాడితే పులకించి పోవాలి పుడమితల్లీ.పారిపోకూడదు పాటల ప్రియులు. ఎవరి గొప్పలో వినిపించి ,అందరిని గాండ్రించి గుట్టుచప్పుడు కాకుండా గొప్పవారిపేరుతో నొక్కేస్తున్న కాసులు కనిపించకూడదని కళామతల్లి బిడ్డలపై కుట్రలు చేస్తారా.. ఇదేనా మీ ధర్మమంటూ దిగులు చెందుతున్నారు ఈ ధరిత్రిలో. ఒక్కొక్క గాయనీ గాయకులు అక్కడ జరుగుతున్న తీరును ఎండగడుతున్న నాకు వాటితో పనిలేదు నాపాట, నా శాలువా, నా పూలమాలే నాకు ముఖ్యమని నడుస్తున్న వీరి తీరును చూసి కళామతల్లి నవ్వుల పాలవుతోందా అన్న సందేహం వ్యక్తం అవుతోంది.ఓ సీనియర్ కళాసంస్థ అధినేత పేద కళాకారుల పడుతున్న పాట్ల పై ప్రజాభూమి నిరంతర,నిత్యశోధన చేస్తూ నిజాలు బైటికి తెలియజేస్తుంటే ఓర్వలేక ఎక్కడ నొక్కేసిన,నాశనం చేసిన విషయాలు తెలుస్తాయని కారుకూతలు కూస్తూ కళామతల్లి పరువుతీస్తుంటే కన్నీరు మున్నీరవుతున్నారు కళామతల్లి బిడ్డలు. కళామ తల్లిని ఇంకెంత కాలం ఈ గ్రహణం పట్టి పీడిస్తోందో వేచిచూద్దాం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article