వీరితోనే ప్రజలు రక్షింప బడతారా..
వీరే చట్ట సభల్లో ఉండ వలసింది..
వీరు చెప్పిందే వేదమా
వీరే శాసన కర్తలు..వీరేనా సమ సమాజ స్థాపకులు
వీరికే నీతి లేకుంటే వీరేమీ చేస్తారు..
ప్రజలు ప్రజాస్వామ్యమంటే అంత చులకనా…
అధికారం కోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కుతారా..
మీ అధికారం కోసం ఎన్ని కూతలైనా కూస్తారా..
మీకు అధికారం అన్నది శాస్వితం కావాలి..
ప్రజలనే బలి పశువులు చేస్తున్నారుగా ..
మీరొక ప్రజాస్వామ్య వాదులు..మీదొక ప్రజాస్వామ్యం..
చీ…మీరేమి రాజకీయ నాయకులురా అయ్యా..
సిగ్గుతో ప్రజలు తలదించుకోవాలి మిమ్మల్ని చూసి ..
మీ ప్రజాస్వామ్యం తగలెయ్యా…
మీరేనా నీతి వ్యాఖ్యలు చేసేది… మీ నీతి పాడుగాను..
ఇందుకేగా ఈ వ్యవస్థ ఇలా ఏడ్చేది…
గోడ మీద పిల్లుల భాగోతం భలే భలే..
(రామమోహన్ రెడ్డి,సంపాదకులు)
“నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్నిఅగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్నిమారదు లోకం మారదు కాలందేవుడు దిగి రాని యెవ్వరు యేమై పోనిమారదు లోకం మారదు కాలంగాలి వాటు గమనానికి కాలి బాట దేనికిగొర్రెదాటు మందకి మీ జ్ణానబోధ దేనికియే చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠంయే క్షణాన మార్చుకుంది జిత్తుల మార్గంరామబాణమార్పిందా రావణ కాష్ఠంకృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రంనిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్నిఅగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్నిమారదు లోకం మారదు కాలంపాత రాతి గుహలు పాల రాతి గృహాలయినాఅడవి నీతి మారిందా ఎన్ని యుగాలయినావేట అదే వేటు అదే నాటి కధే అంతానట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతాబలవంతులె బ్రతకాలని సూక్తి మరవకుండాశతాబ్ధాలు చదవలేదా ఈ అరణ్యకాండనిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్నిఅగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్నిమారదు లోకం మారదు కాలందేవుడు దిగి రాని యెవ్వరు యేమై పోనిమారదు లోకం మారదు కాలం”అని నాడు గాయం సినిమా ద్వారా సమాజ పోకడలపై వెలుగెత్తి చాటిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి చెప్పిన విదంగా నేడు కూడా అలాంటి పరిస్థితి దాపురించడం సిగ్గుచేటు. ఒకనాడు రాజకీయ నాయకులన్నా రాజకీయలన్నా ఎంతో హుందాతనం గా ఉండేవి. ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఎన్నికలు రాజకీయ నాయకుల విధానాలు అధికార వ్యవస్థ తో విసిగి వేసారిపోయిన ప్రజలు ఒకనాటి ఆంగ్లేయల పాలనను గుర్తు చేసుకుంటారని ఆనాడే చక్రవర్తి రాజగోపాలాచారి చెప్పడం జరిగింది.ఆయన మొదటి చివరి గవర్నర్ గా 1937 లో ఉమ్మడి మద్రాస్ ముఖ్యమంత్రి గా పని చేసారు. ప్రజాస్వామ్యం లో ప్రజలకు ఉపయోగపడే చట్టాలు చేయడానికి ప్రజల చేత ఎన్నుకోబడి సభలలో పెద్దలుగా చెలామణి అవుతున్నారు అయితే ఇదే పెద్ద మనుషులు గోడ మీద పిల్లులు లాగా చొక్కాలు మార్చినట్లు పార్టీలు మారుతున్నది కూడా ప్రజా సేవకోసమేనా లేక పదవి లేకపోతే ప్రజల్లో పలుకుబడి తగ్గి ఏలుబడి పోతుందని భయమా అన్నది అర్థం కావడం లేదు. ఆయితే వర్తమాన కాలంలో రాజకీయాలు ఊసరవెల్లి రంగులకంటే దారుణంగా రంగులు మార్చుకుంటుంది.గతంలో కూడా ఇలాంటి బావ దరిద్రం ఉన్నా నేడు చూస్తున్న దిగజారి పోయిన రాజకీయాల కంటే చాలా భిన్నంగా ఉండేవి.ముఖ్యంగా తెలుగు రాజకీయాలు మరింత దారుణంగా ఉన్నాయి. ఈ దారుణ పరిస్థితి నవీన రాజకీయాల్లో మరింత ముదిరిపోయి మానవత్వం కూడా లేకుండా మరి నీచ స్థాయికి దిగజారి పోయాయన్నది నిత్య సత్యం గా నిలుస్తుంది రాష్ట్ర విభజన తరువాత నవ్యాంధ్రప్రదేశ్ లో నాటి నుండి నేటి వరకు జరుగుతున్న నాటకీయ రాజకీయాలు నవ్వుల పాలు చేసేలా ఉన్నాయి.నవ్యాంధ్రప్రదేశ్ ఆవిర్భావం తరువాత నాటి నేటి ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడి దార్శనికత ముందు చూపు అని అనేక మంది ఇతర పార్టీల నేతలు టీడీపీ లోచేరి ఉన్నత పదవులు అనుభవించారు.ఆ తరువాత వైసీపీ ప్రభంజనం లో టీడీపీ అధికారాన్ని కోల్పోయిన వెంటనే టీడీపీ ని వీడి వైసీపీ కి క్యూ కట్టి అక్కడ అధికారాన్ని అనుభవిస్తూ కనీస రాజకీయ జ్ఞానం లేకుండా ఆ పార్టీ పై అవాకులు చవాకులతో రెచ్చిపోయారు.ఇక జనసేన పైకూడ కుటుంబ విలువలను దిగజార్చే విదంగా చెండాలంగా వెకిలి కూతలు కూసారు. ఇపుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరునెలలు కాకముందే క్యూ కట్టి వైసీపీ అధినేత ఆ పార్టీ పై కాదు కూతలు కూస్తున్నారు. ఇదే నాయకులు అసెంబ్లీ సాక్షిగా అర్ధ శతాబ్దపు రాజకీయ అనుభవం కలిగి ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి గా ప్రతిపక్ష నేత గా ప్రజాక్షేత్రం లో ప్రజాభిమానాన్ని కూడగట్టుకున్న చంద్రబాబు నాయుడుపై ఆయన కుటుంబం పై కారుకూతలు కూస్తుంటే ఆనందంతో ఆస్వాదించిన వారు ఆరునెలల అధికారం పోయే సరికి అయ్యో తప్పులు జరిగాయి చీ తూ అంటూ తడబాటు లేకుండా కూటమి కి జైకొట్టి జగన్ పై కూతలు కూస్తున్నారు ఇది నేటి రాజకీయ నాయకులు ఆత్మగౌరవము. మరి ఇలాంటి వ్యక్తులను పార్టీలలో చేర్చుకుని పదవులు కట్టబెట్టే పార్టీ అధ్యక్షుల పాదాలకి పాలాభిషేకం చేయాలా లేక ఉసరవెల్లి కంటే తొందరగా రంగులు మారుస్తూ కండువాలు మారుస్తున్నవారికి కనకాభిషేకం చేయాలో ఆయా పార్టీల కార్యకర్తలు పార్టీ కేడర్ ఆలోచన చేయాలి. ఇలాంటి రాజకీయ పరిస్థితి చూసి ఆహా ఇదేగా అసలైన ప్రజాస్వామ్యం వీరేనా మన ప్రజాస్వామ్య వాదులని పక్కున నవ్వుతున్నారు నాటి రాజకీయ కురువృద్ధులు.అంతిమంగా ప్రజలే అమాయకత్వం తో అల్లాడి పోవాల్సిందేనని అంటున్నారు అన్ని తెలిసిన వారు. అందుకే సిరివెన్నెల మాటలలోని మారదు ఈలోకం..మారదు ఈ కాలం అని మౌనంగా ఉండాలని అంటున్నారు మేధావి వర్గం వారు.
This is a topic close to my heart cheers, where are your contact details though?