మార్కాపురం
స్థానిక కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల లో శుక్రవారం రోజున ఏపీ ఆర్ స్కూల్ గణపవరం 9వ తరగతి విద్యార్థులు సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ విజిట్ లో భాగంగా కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో సందర్శించినట్లు కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ అన్న కృష్ణ చైతన్య గారు ఒక ప్రకటనలో తెలియజేశారు ఈ కార్యక్రమంలో భాగంగా గణపవరం 9వ తరగతి విద్యార్థులు ఇండస్ట్రియల్ విజిట్ లో భాగంగా కిట్స్ కళాశాలను సందర్శించారని, ఆ విద్యార్థులకు ప్రస్తుత కంప్యూటర్ యుగంలో మనం ఎలా ప్రవర్తించాలి, కంప్యూటర్ పై అవగాహన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ ఎలా వర్క్ చేస్తాయి, అనేక అంశాలపై వాహన కల్పించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో , కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి కృష్ణారెడ్డి గారు , వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ డాక్టర్ జెవి అనిల్ కుమార్ , పి. రామ్మోహన్,కే రాముడు, కే కిషోర్ బాబు,ఏ. అమృతవల్లి, ఏపీ ఆర్ స్కూల్ గణపవరం ఒకేషనల్ ట్రైనర్ పి మధు, ఉపాధ్యాయ ఉపాధ్యాయేతర, విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు.