Sunday, November 16, 2025

Creating liberating content

తాజా వార్తలుఘనంగా కాకినాడ జిల్లా దివ్యాంగుల అధ్యక్షులు మండపాక అప్పన్న దొర పుట్టినరోజు వేడుకలు

ఘనంగా కాకినాడ జిల్లా దివ్యాంగుల అధ్యక్షులు మండపాక అప్పన్న దొర పుట్టినరోజు వేడుకలు

ఆశీస్సులు అందించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ దంపతులు,కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్

జగ్గంపేట :కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కాకినాడ జిల్లా టిడిపి విభిన్న ప్రతిభావంతుల(దివ్యాంగుల) అధ్యక్షులు మండపాక అప్పన్న దొర పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ,జగ్గంపేట కో-ఆపరేటివ్ సొసైటీ మాజీ అధ్యక్షురాలు, జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ చైర్మన్ జ్యోతుల మణి దంపతులు,కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ హాజరై కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఆశీస్సులు అందించారు.ప్రముఖ పారిశ్రామిక కర్రి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా పూలమాలలు,శాలువాలతో ఘనంగా సత్కరించి వేద పండితుల ఆశీర్వాదం అందించారు.అప్పన్న దొరకి నియోజవర్గం ప్రముఖులు,తెలుగుదేశం, జనసేన,బిజెపి నేతలు,జర్నలిస్ట్ మిత్రులు ప్రత్యక్షంగానూ,పరోక్షంగానూ వివిధ సామాజిక మాధ్యమాల పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మారిశెట్టి భద్రం, దేవరపల్లి మూర్తి,కొత్త కొండబాబు,అనుకుల శ్రీకాంత్, బుర్రి సత్తిబాబు,దాపర్తి సీతారామయ్య,రేఖా బుల్లిరాజు,వేములకొండ జోగారావు, బొద్దిరెడ్డి సుబ్బారావు,సర్పంచ్ బచ్చల నాగరత్నం సుధీర్,పీలా మహేష్,రాయి సాయి,బద్ది సురేష్, బొడ్డేటి సుమన్, నాగం వెంకటపతి, తుమ్మల కిషోర్, ఆనంద్,హరి గోపాల్, మోరుకుర్తి రాజు,వైభోగుల శ్రీనివాస్ యాదవ్,ఈశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article