తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయ భవనం కూల్చివేత
చంద్రబాబు కక్ష సాధిస్తున్నాడంటూ జగన్ ఆగ్రహం..మీరు కట్టేది అక్రమ నిర్మాణం అంటూ పల్లా శ్రీనివాసరావు ఫైర్
తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయ భవనాన్ని కూల్చివేశారంటూ మాజీ సీఎం జగన్ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడిన సంగతి తెలిసిందే. చంద్రబాబు కక్షసాధింపు చర్యలకు దిగారని, దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారని ట్వీట్ చేశారు. జగన్ ట్వీట్ పై ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పందించారు. “మీరు కడుతోంది అక్రమ నిర్మాణం… అది కూడా ప్రభుత్వ భూమిలో. అధికారులు సరిగ్గానే చర్యలు తీసుకుంటున్నారు. చంద్రబాబు మీలాగా కాదు… ఆయన ఎప్పుడూ ప్రజా ఆస్తులను ధ్వంసం చేయలేదు. ప్రజల కోసం ఉద్దేశించిన భూమిని మీరు సిగ్గులేకుండా కబ్జా చేశారు. అయినాగానీ మీరు కబ్జా చేసిన భూములను ఎవరూ తాకకూడదా? ముందు అసెంబ్లీకి రండి” అంటూ పల్లా శ్రీనివాసరావు ధ్వజమెత్తారు.

