Saturday, November 15, 2025

Creating liberating content

తాజా వార్తలువల్లభనేని వంశీపై లుకౌట్ నోటీసులు జారీ చేసిన ఏపీ పోలీసులు?

వల్లభనేని వంశీపై లుకౌట్ నోటీసులు జారీ చేసిన ఏపీ పోలీసులు?

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఏపీ పోలీసులు షాకిచ్చారు! ఆయన విదేశాలకు వెళ్లకుండా లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. కొన్నిరోజుల కిందటే ఈ నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ నోటీసులకు ముందే ఆయన విదేశాలకు వెళ్లినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ విషయాలను పోలీసులు నిర్ధారించాల్సి ఉంది. ఈ కేసులో ఇప్పటి వరకు 21 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వల్లభనేని వంశీ ప్రోద్బలంతోనే తాము ఈ దాడికి పాల్పడినట్లు అరెస్టైన వారిలో కొంతమంది పోలీసులకు చెప్పారు. దీంతో వంశీని కూడా నిందితుడిగా చేర్చారు. ప్రస్తుతం అతను ఈ కేసులో ఏ71గా ఉన్నాడు.ఈ కేసులో పోలీసులు మరో ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు. ఏ21 మొండెం రాంబాబు, ఏ50 అమరేంద్రరెడ్డి, ఏ62 ఇమ్రాన్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. అయితే దీనిపై పోలీసుల నుంచి ప్రకటన రావాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article