ఏపీ సమావేశాల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం ముగిసింది. గత ప్రభుత్వం చేసిన తప్పులు, ప్రస్తుతం సర్కార్ చేపడుతున్న కార్యక్రమాలపై ఆయన ప్రసంగించారు. గత ప్రభుత్వంలో జరిగిన నష్టాన్ని ప్రభుత్వం తరపున సభలో వినిపించారు. అయితే గవర్నర్ ప్రసంగిస్తుండగా వైసీపీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైసీపీ శ్రేణులపై జరిగిన దాడులపై నిరసన వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగిస్తుండగానే జగన్ సహా వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. కొద్దిసేపటికి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం ముగియడంతో అసెంబ్లీ సమావేశాలను మంగళవారానికి వాయిదా వేశారు.