గురువులను సన్మానించిన పూర్వపు విద్యార్థులు
రామచంద్రాపురం :రామచంద్రపురం మండలంలోని అనుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 2002–2003 విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదివిన పూర్వపు విద్యార్థుల అపూర్వ కలయిక ఆదివారం ఆనందోత్సవాల మధ్య జరిగింది. అనుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదివి ఉత్తీర్ణులై…. అనంతరం ఉన్నత చదువులను అభ్యసించి స్థిరపడిన పూర్వపు విద్యార్థులు అందరూ పాఠశాలలో కలుసుకోని ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పూర్వపు విద్యార్థులలో చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు,ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగాలు, వ్యాపారాలలో స్థిరపడ్డారు. ఈ బ్యాచ్ లో మొత్తం 20 మంది విద్యార్థులు పదవ తరగతి చదివారు. మీరందరూ వివిధ ప్రాంతాలలో స్థిరపడ్డారు. వీరందరికీ సమాచారం ఇవ్వడంతో కుటుంబ సమేతంగా అందరూ ఈ అపూర్వ కలయికకు హాజరయ్యారు. మధ్యాహ్నం విందు భోజనాలు ఏర్పాటు చేసుకుని సంతోషంగా అపూర్వ కలయిక కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకున్నారు. అనంతరం విద్య నేర్పిన గురువులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గురువులకు పూర్వపు విద్యార్థులు దుశ్యాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా పూర్వపు విద్యార్థులు మాట్లాడుతూ అనుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మురళీమోహన్, బాలాజి ,గురు సుబ్రహ్మణ్యం, సుమతి, సుబ్బలక్ష్మి, పూర్వపు విద్యార్థులు పందికుంట పురుషోత్తం రెడ్డి, బండి జైపాల్ రెడ్డి, ముక్కణం నాగార్జున, గాయత్రి, హంస, గజ్జలు ముని ప్రసాద్, బి. రమణమ్మ, ఎద్దుల ఢిల్లీ రాణి, తాతిరెడ్డి సోమశేఖర్ రెడ్డి,àతదితరులు పాల్గొన్నారు.

