Tuesday, February 17, 2026

Creating liberating content

తాజా వార్తలుపవన్ కల్యాణ్ విజయం… కృతజ్ఞతలు తెలిపిన అన్నా లెజ్నెవా, అకీరా

పవన్ కల్యాణ్ విజయం… కృతజ్ఞతలు తెలిపిన అన్నా లెజ్నెవా, అకీరా

జనసేనాని పవన్ కల్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి వంగా గీత కంటే భారీ ఆధిక్యంలో ఉన్నారు. ఇక ఆయన ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టడం లాంఛనమే. ఈ నేపథ్యంలో, పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజ్నెవా, తనయుడు అకీరా నందన్ ఓటర్లకు, జనసైనికులకు కృతజ్ఞతలు తెలియజేశారు. కౌంటింగ్ ట్రెండ్స్ బయటికి రాగానే పవన్ కల్యాణ్ నివాసం వద్ద కోలాహలం నెలకొంది. పవన్ భార్య లెజ్నెవా బయటకు వచ్చి మద్దతుదారులందరికీ చేతులెత్తి నమస్కరించారు. అందరికీ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. అటు అకీరా నందన్ కూడా తండ్రి విజయం పట్ల హర్షం వ్యక్తం చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article