Wednesday, September 17, 2025

Creating liberating content

తాజా వార్తలుమూడు వారాల్లో అన్నా క్యాంటీన్లను పునరుద్దరిస్తాం

మూడు వారాల్లో అన్నా క్యాంటీన్లను పునరుద్దరిస్తాం

పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ
మంత్రి పొంగూరు నారాయణ

నిరుపేదలకు కేవలం రూ.5/- లకే ఉదయం టిఫిను, రూ.5/- లకే మద్యాహ్న భోజనం మరియు రూ.5/- లకే రాత్రికి భోజనం అందజేసే అన్నా క్యాంటీన్లను మూడు వారాల్లో పునరుద్దరిస్తామని రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రిగా పొంగూరు నారాయణ పేర్కొన్నారు. వెగలపూడి రాష్ట్ర సచివాలయంలో ఆదివారం ఉదయం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే అన్నా క్యాంటీన్ల పునరుద్దరణపై మున్సిఫల్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహిం చారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలిసారిగా చేసిన ఐదు సంతకాల్లో అన్నా క్యాం టీన్ల పునరుద్దరణ ఫైల్ కూడా ఉందన్నారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో 203 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టినప్పటికీ 184 క్యాంటీన్లను ప్రారంభించగా మిగిలిన 19 క్యాంటీన్లు నిర్మాణ దశలో ఉండిపోవడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తం గా ఉన్న అన్ని ప్రముఖ కేంద్రాల్లో ఆహ్లదకరమైన వాతావరణంలో నిరుపేదలకు కేవలం రూ.5/- లకే ఉదయం టిఫిను, రూ.5/- లకే మద్యాహ్న భోజనం మరియు రూ.5/- లకే రాత్రికి భోజనం అందజేసే అన్నా క్యాంటీన్ల వ్యవస్థను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. అయితే నిర్వీర్యం అయిపోయిన అన్నా క్యాంటీను పునరుద్దరించేందుకు అవసరమైన మరామత్ములు చేసేందుకు అంచనాలను రెండు మూడు రోజుల్లో అందజేయాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. గతంలో అన్నా క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతను ఇస్కాన్ ఆధ్యాత్మిక సంస్థకు అప్పగించండం జరిగిందని, మూడు పూట్లా ఆహారం అందజేసేందుకు రోజుకు రూ.73/- లను చార్జి చేయడం జరిగిందన్నారు. అయితే అన్నా క్యాంటీన్ల ద్వారా రోజుకి కేవలం రూ.15/- లకే మూడు పూట్లా ఆహారం అందజేస్తూ మిగిలిన రూ.58/- లను రాయితీగా ప్రభుత్వమే భరించడం జరిగిందన్నారు. రోజుకి 2.25 లక్షల మంది అన్నా క్యాంటీన్ల ద్వారా భోజనం చేసే వారని, తమ హయాంలో మొత్తం మీద 4 కోట్లు 60 లక్షల 31 వేల 600 ప్లేట్ల భోజన్నాన్ని అన్నా క్యాంటీన్ల ద్వారా పంపిణీ చేయడం జరిగిందన్నారు. తొలుత మున్సిఫల్ ప్రాంతాల్లో ఈ అన్నా క్యాంటీన్లు పెట్టడం జరిగిందని, ఆ క్యాంటీన్లకు ప్రజల ఆధరణ ఎంతగానో ఉండటాన్ని గమనించిన చాలా మంది శాసన సభ్యులు గ్రామీణ ప్రాంతాలో కూడా అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని అప్పటి ముఖ్యమంత్రిని కోరగా, గ్రామీణ ప్రాంతాలకు కూడా మరో 150 అన్నా క్యాంటీన్లను ముంజూరు చేయడం జరిగిందన్నారు. పెద్ద ఎత్తున ప్రజల ఆధరణను పొందిన అన్నా క్యాంటీన్లను మళ్లీ పునరుద్దరించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆమోదంతో త్వరలోనే చర్యలు చేపట్టనున్న ఆయన తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article