కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు కారణమైంది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం కావడం, బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేయడం జరుగుతోంది. ప్రస్తుతం ఈ కేసు సీబీఐ విచారణలో ఉంది.అమెరికాలో కూడా ఈ ఘటనపై వైద్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. హ్యూస్టన్, టెక్సాస్ మెడికల్ సెంటర్‌కు చెందిన వైద్యులు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు ఈ నిరసనలో పాల్గొన్నారు. ఇండియాలో వైద్య శిక్షణ పొందిన పలువురు కూడా ఇందులో పాల్గొని, ఆసుపత్రులలో వైద్యులపై జరుగుతున్న హింసను అరికట్టడానికి కఠినమైన చట్టాలు అవసరమని పేర్కొన్నారు.వైద్యులు, ప్రజల ప్రాణాలను కాపాడే వ్యక్తుల రక్షణకు సమర్థవంతమైన చట్టాలు లేకపోవడం దురదృష్టకరమని వారు అభిప్రాయపడ్డారు. ఈ నిరసన ద్వారా, వైద్యులు తమ సహోద్యోగికి న్యాయం కోసం, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రపంచవ్యాప్తంగా విజ్ఞప్తి చేస్తున్నారు.