అకుంటిత దీక్ష..అలవోకగా ఉండటం..
లక్ష్యం కోసం లెక్కచేయని,నిర్లక్ష్యం లేని పయనం..
వృత్తికి న్యాయం చేస్తూ.. ప్రవుత్తిలో పద్ధతి పాటించడం…
పాటలంటే ప్రాణం…పల్లవి మరువని వైనం
గానాన్ని వినిపిస్తాడు గమకాలు తేడా లేకుండా..
చక్కగా పాడతాడు శృతిలయల సంగమం తో..
అందరూ కావలంటాడు… అందులో నేనుండాలంటాడు
కలలంటే మక్కువ అందుకే కళా సంస్థ స్థాపించారు..
స్నేహాన్ని కోరుకుంటాడు అందుకే సాన్నిహిత్యంగా ఉంటాడు..
అధికారం ఉందని విర్రవీగడు అందుకే అందరి అభిమాని అయ్యాడు..
వృత్తి ధర్మం లో ఒత్తిడులున్నా ఓపిక పడతాడు..
అందుకే ఒక్కొక్క మెట్టెక్కుతూ వస్తున్నాడు..
ఆయనే..డిప్యూటీ కలెక్టర్ ఆశయ్య…
(రామమోహన్ రెడ్డి,సంపాదకులు)
పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని అంటారు పెద్దలు.. అలానే ఈరోజు జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టి డిప్యూటీ కలెక్టర్ గా పదోన్నతి పొందిన బి ఆశయ్య గురించి ఎంత చెప్పుకున్న అతిశయోక్తి కాదని చెప్పక తప్పదు. ఆయన జీవితంలో ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తూ నేడు డిప్యూటి కలెక్టర్ స్థాయికి ఎదగడం ఎంతో మంచి శుభపరిణామం అయితే ఆయన జీవితంలో ఇంకొక ఉత్తమ సంఘటన ఉంది. అదే కళ. ఇక్కడే ఆయన్ను పువ్వు పుట్టగానే పరిమళించినది చెప్పాలి. కృష్ణా జిల్లా నందిగామ కంచిక చర్ల లో ఓ మారుమూల గ్రామంలో జన్మించారు.మారుమూల గ్రామంలో జన్మించిన ఆశయ్యగారు సంగీతం మీద మక్కువ పెంచు కున్నారు.ఏడవ తరగతి నుంచే పాటలు పాడటం మొదలు పెట్టారు.పల్లెల్లో పని పాట లేదా అంటారు…ఈయన పనితో పాటను కూడా అలవరుచుకుని అలవోకగా చదువుతో పాటు చనువుగా ఉంటూ సంగీతాన్ని ఆస్వాదిస్తూ అదే బాటలో గీతాలను అలపిస్తూ అంచలంచే లుగా అటు సంగీతం పాటు చదువును బ్యాలెన్స్ చేస్తూ బడాయి కి పోకుండా బడా స్తాయికి ఎదిగిన ఓ పల్లెటూరి ఆణిముత్యం ఆశయ్య. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న ఆశయ్య ఆశయం ఆయన్ని అటు వృత్తిలో ఇటు ప్రవుత్తిలో పై స్థాయికి రావడం జరిగింది.ఇక్కడ ప్రధానంగా ఆశయ్య ఆశయం చాలా గొప్పది. చిన్నతనం నుంచే అకుంఠిత దీక్షతో కొంటె పనులకు అవకాశం లేకుండా అన్నిటినీ అలవోకగా చేసుకుని ఆలోచనా పరుడై అత్యాశ పరుడు కాకుండా అత్యున్నత స్థాయికి రావడం సంతోషించదగ్గ విషయం. ఇక్కడ వృత్తిలో కానీ ప్రవుత్తిలో కానీ లక్ష్యం కోసం నిర్లక్ష్యం చేయక వృతిలో న్యాయబద్దంగా ఉంటూ ప్రవుత్తిలో పద్దతి గా ఉంటూ పాటలు పాడుతూ పెదవి విరుపు లేకుండా ఎంతో విజ్ఞత చూపుతూ ముందు చూపుతో అందరిని మెప్పిస్తూ తాను కూడా మెప్పు పొందుతూ ముందుకు సాగుతూ ఆశయ్య అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటున్నారు.
పాటలంటే ప్రాణం ఉండటం తో పల్లవి చూసుకుని పాడుతూ శృతి లయల సంగమాన్ని సరి చేసుకుంటూ చక్కగా గానాన్ని వినిపిస్తూ ఓ వైపు గాంభీర్యం ప్రదర్శిస్తూ నిరాడంబరంగా ఉంటూ నే ఎవరినీ నిందించకుండా ఇతరులచే నిందలు పడకుండా నిదానంగా నిబద్ధతతో ఉంటూ అడుగులు వేస్తున్నారు ఆశయ్య. చిన్నతనం నుంచి కళలంటే ప్రాణం కావడంతో తానే ఒక కళా సంస్థ ఏర్పాటు చేసుకుని ఓకే కళా సంస్థ అధినేత గా కళా కారులుకు కొంత మేరైనా తోడ్పాటు అందించాలని తడబడకుండా అడుగులు వేస్తూ ఆశయ్య పయనం సాగుతోంది. ఇంతటి గొప్ప వ్యక్తి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది… ఇది అతిశయోక్తి అనుకుంటే అది వారి విజ్ఞత కే వదిలేయక తప్పదని తెలుపుతూ ఇంకోసారి పదోన్నతి శుభాకాంక్షలు ఆశయ్యకు.