Friday, September 12, 2025

Creating liberating content

తాజా వార్తలుఅమ్మ కంటే అధికంగా అంబేద్కర్ బొమ్మను ప్రేమిస్తున్న దళితులు

అమ్మ కంటే అధికంగా అంబేద్కర్ బొమ్మను ప్రేమిస్తున్న దళితులు

అగ్రకుల దురహంకారమును అనగదొక్కి ఆకాశమెత్తు నిలిచిన అణగారిన వర్గాల ఆశాజ్యోతి
నేడు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 133వ జయంతి
అంబేద్కర్ ఆశయసాధన కోసం అట్టడుగు వర్గాల ఆశలు – ఘోషలు

హనుమంతునిపాడు
అంటరానితనం కులనిర్ములన కోసం అణగారిన వర్గాల అభ్యున్నతికోసం అలుపెరుగని పోరాటం చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా హనుమంతునిపాడు మండల కులవివక్ష వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షుడు, కనిగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ కొండెపోగు రాబర్ట్(రోబో) ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో భాగంగా భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త, స్వతంత్ర భారత దేశ తొలి న్యాయశాఖ మంత్రి, భారత రాజ్యాంగ శిల్పి, భారతరత్న ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన జ్ఞానానికి ప్రతీక (జ్ఞానానికి చిహ్నం) డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ 1891 ఏప్రిల్ 14వ తేదీన మధ్యప్రదేశ్ లోని మౌ అనే ప్రాంతంలో జన్మించారని తెలిపారు. అస్పృశ్యత అంటరానితనం వలన అతిచిన్న వయసులోనే బాధితుడై పాఠశాల విద్య సమయంలోనే పక్కన కూర్చోబెట్టారు. దృఢసంకల్పంతో మొక్కవోని దీక్షతో అడుగడుగునా అవమానాలు అవరోధాలు ఆటంకాలు ఎదురైనా ఎన్నో శ్రమలకోర్చి లక్ష్యం దిశగా వడివడిగా అడుగులు వేస్తూ కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి, లండన్ విశ్వవిద్యాలయం నుండి బి.యస్.సి పట్టా పొందారు. ఇలా పట్టాలు పొందుతూ భారత దేశంలోనే అత్యధిక ఉన్నత చదువులు చదివింది డాక్టర్ బి.ఆర్.అంబెడ్కర్ అంటే అతిశయోక్తి కాదు. దళితుల కోసం సామాజిక ఆర్ధిక రాజకీయ పరిశోధనలు చేసి “రాజ్యాధికారం” అంతిమ లక్ష్యం అని వెలుగెత్తి చాటారు. నాడు మహాత్మా గాంధీజీ జవహర్ లాల్ నెహ్రూ సర్ధార్ వల్లభాయ్ పటేల్ వంటి దిగ్గజ రాజకీయ నాయకులు ఉన్నత వర్గాలకు మాత్రమే ఓటు హక్కు ఉండాలని భావిస్తే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరిని ఎదిరించి కుల మత ప్రాంత బాషా లింగ వివక్ష లేకుండా 18 ఏళ్ళు నిండిన ప్రతి పౌరునికి ఓటు హక్కు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరణాంతరం 1990లో భారత ప్రభుత్వం “భారతరత్న” ప్రకటించింది. అంటరానితనం కులనిర్ములన పోరాటాల కోసం కుటుంబంను సైతం పక్కన పెట్టి నిస్వార్థంగా ప్రజాసేవ చేసిన నాయకుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అని ప్రపంచ మేధావిని కుల నాయకునిగా నేటి రాజకీయ నాయకులు చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని కులాల కోసం అన్ని వర్గాల కోసం అంబేద్కర్ పోరాటం చేసి రాజ్యాంగ హక్కులు కల్పిస్తే ఆగ్రకుల దురహంకారులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను దళితులకే దైవంగా ప్రచారం చేయటం దుర్మార్గం అని తెలిపారు. అణగారిన వర్గాల కుటుంబంలో జన్మించారని వారికి మాత్రమే సొంతం అనుకోకుండా ప్రతి భారతీయుడు అంబేద్కర్ జయంతిని జరిపి ఆయనకు ఘన నివాళులు అర్పించాలన్నారు.

అమ్మ కంటే బొమ్మను ఎక్కువగా ప్రేమిస్తున్న దళితులు
అమ్మ కంటే అంబేద్కర్ బొమ్మనే దళితులు ఎక్కువగా ప్రేమిస్తారని తెలుసుకొనిన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆకాశంలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహం పెట్టి అమాయకపు దళితులను పాతాళంలో పాతిపెట్టారు. ప్రపంచ మేధావి అంతర్జాతీయ నాయకుడైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు ఒక కోనసీమ జిల్లాకు పెట్టుటకు దళిత సంఘాలు ప్రజా సంఘాల నాయకులు దీక్షలు ధర్నాలు చేయవలసిన దౌర్భాగ్యం ఈ రాష్ట్రంలో అందరు చూశారు. రాష్ట్ర నాయకుల పేర్లు జిల్లాలకు పెట్టి ఆలస్యంగా కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెడితే ఆపై అల్లర్లు జరగటం చూశామని ఈ సంఘటన అత్యంత బాధాకరమని తెలిపారు. అంబేద్కర్ వాదులు అంబేద్కర్ జయంతి జరిపి నివాళులు అర్పించటం, ఆ తరువాత మరలా వర్ధంతి రోజు కార్యక్రమాలు చేయకుండా అనుదినం బడుగు బలహీన వర్గాలను చైతన్యపరుస్తూ అంబేద్కర్ ఆశయసాధన రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా అడుగులు ముందుకు వేయాలన్నారు. అప్పుడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు నిజమైన నివాళులు అర్పించినట్లని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article