నిత్యం అప్రమత్తంగా ఉండండి
- తాజా పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం అందించండి
- అక్రమ మద్యం, గుట్కా, మట్కాలపై ప్రత్యేక నిఘా వేయండి
- జిల్లా స్పెషల్ బ్రాంచి అధికారులు, సిబ్బందితో జిల్లా నూతన ఎస్పీ తొలి ప్రత్యేక సమావేశం
- అనంతపురము :నిత్యం అప్రమత్తంగా ఉంటూ అక్రమ మద్యం, మట్కా, గ్యాంబ్లింగ్, గుట్కాలపై ప్రత్యేక నిఘా వేయాలని జిల్లా నూతన ఎస్పీ పి.జగదీష్ ఆదేశించారు. జిల్లా స్పెషల్ బ్రాంచి అధికారులు, సిబ్బందితో ఆయన స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం ప్రత్యేకంగా తొలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ పలు సూచనలు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న స్పెషల్ బ్రాంచి సిబ్బంది పనితీరుపై సమీక్షించి దిశానిర్ధేశం చేశారు. మట్కా, పేకాట, నిషేధిత గుట్కా పదార్థాల విక్రయాలు, అక్రమ రవాణాలపై ప్రత్యేక దృష్టి సారించి ఎప్పటికప్పుడు సమాచారం సేకరించాలన్నారు. జిల్లాలో ఫ్యాక్షన్, శాంతిభద్రతలు సమస్యలు తలెత్తకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఈ సమావేశంలో స్పెషల్ బ్రాంచి సి.ఐ ధరణీ కిశోర్, జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎస్బీ హెడ్ కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.