వి.ఆర్.పురం
ఋతు క్రమంలో కిషోర్ బాలికలు పరిశుభ్రత తోపాటు, మంచి ఆహారం తీసుకోవాలని, ఐసీడీఎస్ సీడీపీవో అన్నారు. ఋతు పరిశుభ్రత వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం మండల కేంద్రం ఎంపీడీవో కార్యాలయం వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎంపీపీ కారం లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీడీపీఓ మాట్లాడుతూ ప్రతి నెల బహిష్టు సమయంలో రెండు పూటలా స్నానం చేయాలని, సురక్షితమైన ప్యాడ్స్ వాడాలని, సురక్షితమైన క్లాత్ లు వాడవ, ఎప్పటికప్పుడు ప్యాడ్స్ మార్చాలని, తీసేసిన పాడ్స్ మూత ఉన్న చెత్త బుట్టలో వేయాలని, లేదా గుంట తవ్వి దానిలో వేసి కాల్చవచ్చని ఋతు పరిశుభ్రత గురించి కిషోర్ బాలికలకు వివరించి చెప్పారు. ఆ టైంలో మంచి ఆహారం తీసుకోవాలని, ఐరన్ మాత్రలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దమట్ట పల్లి, రేఖపల్లి, చొప్పల్లి, కుందులూరు సర్పంచులు, జిఎంఎస్కేలు, మండలం ఏ డబ్లు డబ్లూ ఎస్, ఏ డబ్లూ హెచ్ ఎస్, ఐసీడీఎస్ సూపర్ వైజేస్ తదితరులు పాల్గొన్నారు.
