పోరుమామిళ్ల:కార్మికులపై బెదిరింపులు మానుకో వాలని,వారినితొలగింపు చర్యలకు పూనుకోవడం గాని,వేధింపులకు దిగడం జరిగితే సహించేది లేదని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పిడు గు మస్తాన్ పేర్కొన్నారు. తొలగింపు చర్యలుఆపాలని మండల డిప్యూటీ తహసిల్దార్ సంజీవరెడ్డికిఏఐటీయూ సీ ఆధ్వర్యంలోవినతిపత్రంసమర్పిం చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నియమితు లయ్యారన్న సాకుతో వివిధప్రభుత్వ స్కీంలలో పనిచేస్తున్న (అంగన్వాడి, ఆశ,మధ్యాహ్నం భోజనం) ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు, డ్వా క్రా సంఘాల లీడర్లు,స్వచ్ఛభారత్ కార్మికులు చిరుద్యోగులను మాను కోవాలని అధికారులతో తొలగించే విధానాలకు స్వస్తి పలకాలని ఏఐటియుసి రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం పోరుమామిళ్ల మండల డిప్యూటీ తహసిల్దార్ సంజీవ్ రెడ్డికి ఏఐటీయూసీ మండల సమితి వినతి పత్రం సమర్పించారు రోజువారీ వేతనం మీద ఆధారపడి బతుకుతున్న చిరుద్యోగులును అధికార పార్టీ నాయకులు మాటలు విని ఉపాధి అవకాశాలను తొలగిస్తే జీవించడమే కష్టమవుతుంది. ఇలాంటి చర్యలను ప్రజలు హర్షించరు. గతంలో ఆ పార్టీ చేసింది కదా మేము అధికారంలోకి వచ్చాం మేము చేస్తామని సమర్థించుకోవడం సరైనది కాదన్నారు. పార్టీలకు అధికారం శాశ్వతం కాదు, కానీ ప్రజలకు వివిధ సేవలు అందించాల్సిన ప్రభుత్వ యంత్రాంగం మాత్రం శాశ్వతం. ఏ పార్టీ అధికారంలో వున్నా ఈ యంత్రాంగం ద్వారానే ప్రజాపాలన అందించాలి. రాష్ట్రంలో సుమారు నాలుగు లక్షల మంది కార్మికులు వివిధ ప్రభుత్వ పథకాల అమలులో భాగంగా పనిచేస్తున్నారు. అంగన్వాడీ సెంటర్లలో లక్ష మందికి పైగా, మధ్యాహ్న భోజన ఏజెన్సీల కింద 80 వేల మంది, ఆశా కార్మికులుగా 45 వేల మంది, ఆర్పీలుగా మరో 28 వేల మంది విధులు నిర్వహి స్తున్నారు. వీరిలో అత్యధికమంది పెద మహిళలు.
ఈ కార్మికుల ద్వారా అమలవుతున్న పథకాలన్నీ పేదరిక నిర్మూలన, తల్లుల, పిల్లల ఆరోగ్యం, పొదుపు సంఘాల ద్వారా ఆర్థిక నిర్వహణ లాంటి కీలకమైన లక్ష్యాలతో అమలవుతున్నాయి. ఈ పథకాల అమలు కోసం దశాబ్దాలుగా పనిచేస్తున్న కార్మికులకు మాత్రం కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, ప్రమాద బీమా, రిటైర్‌మెంట్ సదుపాయం లాంటివి కూడా అమలు కావడంలేదు. అరకొర వేతనంపై అధారపడి జీవించే ఈ కార్మికులు ప్రభుత్వాలు మారినప్పుడల్లా అభద్రతతో జీవించాల్సి వస్తుంది. అధికార పార్టీ నాయకులు చేసే వేధింపులు పిల్లికి చెలగాటం ఎలుక కు ప్రాణ సంకటంగా మారుతున్నాయన్నారు.
రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారం ఉంటే వారిని చిరుద్యోగులను బెదరించడం, బలవంతాన రాజీనామాలు చేయించడం లాంటి సంఘటనలతో కొందరు కార్మికులు బలవన్మరణాలకు సిద్ధం అవుతున్న పరిస్థితి రావడం కొత్త ప్రభుత్వానికి శుభపరిణామం కాదు
గతంలో ఉద్యమించిన కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ముఖ్యంగా అంగన్‌వాడీ, ఆశా, మున్సిపల్ కార్మికులు చేసిన సమ్మెలకు మద్దతు ఇచ్చిన టిడిపి నాయకులు నేడు ఆ చిరుద్యోగులను తొలగించడం ఏం విధానం? రాష్ట్రంలో అధికార పార్టీ నేతల మెప్పు కోసం ఎంతటి చట్టవిరుద్ధమైన lపనులనైనా చేయడం, అధికార పార్టీ మారింది కాబట్టి చిరుద్యోగులను తొలగిస్తామనే విధానాలకు స్వస్తి పలకాలని లేకపోతే జిల్లా, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాల్సి వస్తుందన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పిడుగు మస్తాన్, సిపిఐ మండల కార్యదర్శి రవికుమార్, ఏఐటీయూసీ మండల కార్యదర్శి సఫా, సహాయ కార్యదర్శి కేశవ, అధ్యక్షులు మహమ్మద్ రఫీ , చాంద్ బాషా, భోజన నాయకురాలు రేణుకమ్మ శ్రీనివాసులు, చంద్ర. తదితరులు పాల్గొన్నారు.

