Friday, September 12, 2025

Creating liberating content

తాజా వార్తలుశివయ్యను దర్శించుకున్న అఘోరి

శివయ్యను దర్శించుకున్న అఘోరి

శ్రీకాళహస్తిలో అఘోరిని దగ్గరుండి దర్శనానికి తీసుకెళ్లిన పోలీసులు

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో శివుడ్ని దిగంబరంగానే దర్శించుకుంటానని హల్చల్ చేసిన అఘోరి.. సాయంత్రానికి పంతం వీడింది. వస్త్రాలు ధరిస్తేనే ఆలయంలోకి అనుమతిస్తామని అధికారులు, పోలీసులు చెప్పడంతో.. ఆమె వస్త్రాలు ధరించి ఆలయానికి వచ్చి శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్నారు. గురువారం ఉదయం అఘోరి శ్రీకాళహస్తిలో పెట్రోల్‌ పోసుకుని ఆత్మార్పణ చేసుకుంటానని బెదిరింపులకు దిగారు. పోలీసులు ఆమెను అడ్డుకుని అక్కడి నుంచి తీసుకెళ్లి తమిళనాడు పరిధిలోని ఆరంబాకంలో వదిలిపెట్టారు. అఘోరి మళ్లీ శ్రీకాళహస్తికి రాగా.. గురవారం సాయంత్రం బుచ్చినాయుడు కండ్రిగ దగ్గర పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఆమె కారును తనిఖీ చేసి.. అఘోరి ఒంటిపై బట్టలు లేకపోవడంతో శాలువా ఇచ్చి కట్టుకోమని ఒప్పించారు. అనంతరరం అఘోరిని కారులో నుంచి దించారు.. శ్రీకాళహస్తీశ్వరాలయానికి తాను వస్త్రాలు ధరించి వెళతానని ఆమె చెప్పడంతో బందోబస్తుతో పోలీసులు ఆమెను తీసుకెళ్లి, స్వామి, అమ్మవార్ల దర్శనం చేయించి తీసుకొచ్చి మళ్లీ బయట వదిలేశారు. దీంతో ఈ వివాదం సద్దుమణిగింది.తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన మహిళా అఘోరి పుణ్యక్షేత్రాల సందర్శిస్తున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయానికి గురువారం రాగా.. ఆమె దర్శనంపై ఆలయ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అఘోరి ఒంటిపై వస్త్రాలు లేకుండా శ్రీకాళహస్తీశ్వరాలయ ప్రవేశం చేసేందుకు ప్రయత్నించారు. ఆలయంలోని శివయ్య గోపురం గుండా లోపలికి వెళ్లగా.. మహానందీశ్వరుడి విగ్రహం సమీపంలో భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఆలయ నిబంధనల ప్రకారం అనుమతించబోమని చెప్పడంతో.. భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత ఈ సీన్ మొత్తం బయటకు మారింది.. తనను దర్శనానికి పంపాల్సిందే అంటూ ఆమె ఒంటిపై పెట్రోల్‌ పోసుకున్నారు. ఆమె తన కారుపై పెట్రోల్ పోశారు.. వెంటనే పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. అఘోరీకి ఎంత చెప్పినా వినకపోవడంతో పట్టణ పోలీసులు, ఆలయ భద్రతా సిబ్బంది ఆమెపై నీళ్లు పోశారు. బలవంతంగా ఆమెకు వస్త్రాలు చుట్టారు.. పోలీసులు ఆమెకు ఆలయ విధి, విధానాలను వివరించి దర్శనానికి అనుమతించలేమంటూ నచ్చజెప్పారు. ఆలయ అంబులెన్స్‌లో బందోబస్తుగా మహిళా భద్రతా సిబ్బందితో తమిళనాడు దగ్గరకు తీసుకెళ్లి వదిలేశారు. మళ్లీ ఆమె వెనక్కు వచ్చారు.. శ్రీకాళహస్తీశ్వరాలయ నిబంధనల ప్రకారం ఇక్కడి శాస్త్ర సంప్రదాయాలను గౌరవిస్తూ అఘోరి గురువారం రాత్రి వస్త్రధారణతో స్వామి, అమ్మవార్లను దర్శించుకోవడంతో ఈ వివాదం ముగిసింది.సికింద్రబాద్ పరిధిలోని మోండా మార్కెట్ లో కుమ్మరిగూడలో ముత్యాలమ్మ తల్లి విగ్రహం ధ్వంసం ఘటనతో అఘోరీ తెరపైకి వచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article