Saturday, September 13, 2025

Creating liberating content

తాజా వార్తలుభారీ వర్షాలతో ఏజెన్సీ ప్రాంతం అతలాకుతలం – చంద్ర బాబు సమీక్ష

భారీ వర్షాలతో ఏజెన్సీ ప్రాంతం అతలాకుతలం – చంద్ర బాబు సమీక్ష

ఏడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం వణికి పోతోంది. ఆగకుండా కురుస్తున్న భారీ వర్షంతో కొండవాగులు పొంగుతున్నాయి.వరద నీరు రహదారుల పైకి రావడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. పోలవరం వద్ద గోదావరి వరద ఉధృతి 29 మీటర్లకు చేరుకుంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తూ ఉండడంతో ప్రాజెక్టు 48 గేట్ల నుంచి మూడున్నర లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం ఎర్రకాలువ జలాశయానికి భారీగా వరద నీరు చేరడంతో ముందస్తు చర్యల్లో భాగంగా ప్రాజెక్టు నాలుగు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో జంగారెడ్డిగూడెం నల్లజర్ల తాడేపల్లిగూడెం నిడదవోలు ప్రాంతాల్లోని పంట పొలాలు నీటిమునగనున్నాయి. జల్లేరు తమ్మిలేరు జలాశయాలకు సైతం వరద నీరుకి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది.ఇక ఏజెన్సీ ప్రాంతంలోని గుబ్బల మంగమ్మ ఆలయం సమీపంలో కొండ వాగులు పొంగడంతో పలువురు భక్తులు ఆలయంలో చిక్కుకుపోయారు. వారిని ఆలయ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఏలూరు జిల్లాలోని ముంపు మండలాలైన వేలేరుపాడు కుక్కునూరు ప్రాంతాల్లో రహదారులపై నీరు చేరడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.మరోవైపు.. ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు, వరద తీవ్రతపై అర్ధరాత్రి సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు .. ఏలూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలతో లేట్ నైట్ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ చేశారు.. వరద పరిస్థితిని పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలని ఆదేశించారు.. ప్రాణ నష్టం, పశు నష్టం జరగకుండా చూడాలని సూచించిన ఆయన.. సాధ్యమైనంత వరకు పంట నష్టాన్ని నివారించే చర్యలు తీసుకోవాలన్నారు.. ఏలూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండి, అవసరంలో ఉన్న వారికి సాయం చేయాలన్నారు చంద్రబాబు ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article