కోటనందూరు
పచ్చిరొట్ట ఎరువులతో రైతులకు ప్రయోజనం కలుగుతుందని కోటనందూరు మండలం వ్యవసాయ అధికారి చంద్రశేఖర్ అన్నారు. దున్నిన పంట పొలంలో నేల స్వభావాన్ని బట్టి పచ్చిరొట్ట విత్తనాలైనా జీలుగు, జనుము, విత్తనాల్లో ఏదో ఒకటి జల్లు కోవాలని రైతులకు సూచించారు. కోటనందూరు మండలంలో జీలుగు విత్తనాలు 15.80 క్వింటాలు, జనుము విత్తనాలు 2.20 క్వింటాలు, పిల్లి పెసర విత్తనాలు1.54 క్వింటాలు అందుబాటులో ఉన్నట్టు తెలిపారు