Monday, February 16, 2026

Creating liberating content

సినిమాడ్రగ్స్ కేసు.. పోలీసుల అదుపులో నటి హేమ..

డ్రగ్స్ కేసు.. పోలీసుల అదుపులో నటి హేమ..

బెంగళూరు డ్రస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నటి హేమను బెంగళూరు సీసీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నటి హేమకు సీసీబీ పోలీసులు రెండు సార్లు నోటీసులు జారీచేశారు. ఆమె స్పందించకపోవడంతో బెంగళూరు పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఇక బెంగళూరు పోలీసులు నటి హేమను రేపు కోర్టులోప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. గత నెల 27వ తేదీన, ఈ నెల 1 న 41 సీఆర్ పీసీ కింద నోటీసులు జారీచేశారు.గత నెల 20 పార్టీలో పాల్గొన్న హేమకు డ్రగ్స్ కేసులో పాటిటివ్ గా రిపోర్టు వచ్చింది. ఆమె బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ తీసుకున్నట్లు రిపోర్టులు వచ్చాయి. ఇప్పటికే డ్రగ్స్ కేసులో పోలీసులు 86 మంది వరకు నోటీసులను జారీ చేశారు. ఇక మొదటి నుంచి కూడా నటి హేమ తనకు రేవ్ పార్టీ గురించి సంబంధంలేదని చెప్పుకుంటూ వచ్చింది. అనేక వీడియోలను షేర్ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article