అమరావతి:సస్పెన్షన్ అనంతరం అసెంబ్లీ ప్రాంగణంలో శాసనసభ్యులు దువ్వారపు రామారావు మీడియాతో మాట్లాడుతూ..“రైతాంగ సమస్యలపై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానం తిరస్కరించడమే కాకుండా 10మంది టీడీపీ సభ్యుల్ని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని తీవ్రం గా ఖండిస్తున్నాం. కౌన్సిల్ లోకూడా మేం రైతాంగ సమస్యలపై వాయిదా తీర్మానం ఇచ్చాం. కానీ అక్కడ కూడా ప్రభుత్వం చర్చ చేపట్టలేదు. రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని దేశంలో అగ్రస్థానంలో నిలపడమే జగన్ రెడ్డి సాధించిన రైతు ప్రగతి. రైతులకు ఎరువులు, విత్తనాలు కూడా అందించలేని దౌర్భాగ్యపు స్థి తిలో జగన్ రెడ్డి సర్కార్ ఉంది. టీడీపీప్రభుత్వం ఆక్వా రైతులకు 50శాతం సబ్సిడీ పై అనేక పరికరాలు అందించింది. అన్నదాతా సుఖీభవ కింద రూ.4వేల కోట్లను చంద్రబాబునాయుడు రైతులకు అందించారు. రైతురుణమాఫీ కింద రూ.15వేల కోట్ల అప్పులు మాఫీ చేయడం ద్వారా చంద్రబాబు రైతాంగానికి అన్ని విధాలా అండగా నిలిచారు. సకాలంలో ఇన్ పుట్ సబ్సిడీ, పంటలబీమా సాయం అందించారు. తమ గోడు పట్టించుకోని ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి రాష్ట్ర రైతాంగం సిద్ధంగా ఉంది.” అని రామారావు తెలిపారు.