కదిరి :తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్సిక్స్ పథకాలతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, సంక్షేమ పథకాలతో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉంటారని టీడీపీ, జనసేన, బీజేపీ కదిరి ఉమ్మడి అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ పేర్కొన్నారు. శనివారం తలుపుల మండలం పెన్నబడివాండ్ల పల్లి పంచాయతీ, గూడలాగొంది, ఓబిఆర్ తాండ, పెన్నబడివాండ్ల పల్లి, ఓబి ఆర్ కొత్త పల్లి, పులిగుండ్లవారి పల్లి పంచాయతీ, రాజులోళ్ళ పల్లి, పులిగొండ్ల పల్లి లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కందికుంటకు అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలుకుతూ, ఆడపడుచులు హారతులు ఇస్తూ గ్రామాలలో యువత పెద్ద ఎత్తున పాల్గొని గజమాలతో స్వాగతం పలుకుతూ బ్రహ్మరథం పట్టారు. తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ప్రతి ఒక్కరిని కోరుతూ, ఆప్యాయంగా పలకరిస్తూ ప్రచారం కొనసాగించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, తలుపుల మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.