పులివెందుల :పులివెందుల నియోజకవర్గంలో వేరువేరు ప్రమాదా ల్లో మృతి చెందిన కుటుంబాలను పులివెందుల ఏరియా ఆసుపత్రి వద్ద సోమవారం లింగాల మండల ఇంచార్జ్ వైయస్ అభిషేక్ రెడ్డి పరామర్శిం చారు. లింగాల మండలం లోపట్నూతల గ్రామంలో ఆదివారం విద్యుత్ షాక్ తో మృతి చెందిన సాగర్ కుటుంబాన్ని పరామర్శించి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం యు సి ఐ ఎల్ మార్గంలో అనుమానస్పద స్థితిలో మృతిచెందిన నాగూరు మహమ్మద్ రసూల్ కుటుంబాన్ని పరామ ర్శించారు.అధైర్య పడవద్దు అని,ధైర్యంగా ఉండాల ని వైకాపా పార్టీ అండగా ఉంటుందని వారికి భరో సానిచ్చారు. ఈ కార్యక్రమంలో వైకాపా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.