Sunday, September 14, 2025

Creating liberating content

తాజా వార్తలునా ధ్యాస, ఊపిరి చంద్రగిరి అభివృద్ధే..!అవకాశం ఇస్తే అండగా నిలుస్తా:టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని..

నా ధ్యాస, ఊపిరి చంద్రగిరి అభివృద్ధే..!అవకాశం ఇస్తే అండగా నిలుస్తా:టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని..

చంద్రగిరి:చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ధే నా ధ్యాస, ఊపిరి అని చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని అన్నారు. సోమవారం మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని, బాబు ఘారిటి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా తిరుపతి రూరల్ మండలం, పైడిపల్లి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా జనసేన టీడీపీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పులివర్తి నాని ఇంటింటికి తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాలను గురించి ప్రజలకు వివరించారు. వైసీపీ ప్రభుత్వంలో ఏ ఒక్క వర్గానికి న్యాయం జరగలేదని, ప్రజలు కూడా ఈ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.మద్యపాన నిషేధం, ఉద్యోగులకు సీపీఎస్‌ అమలు, రైతులకు పోలవరం, అమరావతి రాజదాని నిర్మాణం చేయటం చేతకాని ఈ వైసీపీ ప్రభుత్వానికి చేత కావడం లేదని ధ్వజమెత్తారు. ఈ రాష్ట్రం మరలా పూర్వ వైభవం సాదించాలంటే అనుభవ శాలి, సంపద సృష్టించిన మేధావిచంద్రబాబు
నాయుడు తిరిగి ముఖ్యమంత్రిగా రావాల్సిన అవసరం ఉందన్నారు.
గత ఐదేళ్లుగా నియోజకవర్గంలో అరాచక పాలనను ప్రజలందరూ గమనిస్తున్నారని పులివర్తి నాని ఆరోపించారు. అక్రమాలు, దౌర్జన్యాలు, భూ కబ్జాలు, తిరగబడితే కేసులు తప్ప ఎమ్మెల్యే చేసిన ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేదని అన్నారు. నియోజకవర్గాన్ని గాడిలో పెట్టేందుకు ఒక్క అవకాశం ఇవ్వాలని పులివర్తి నాని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన, బీజేపి నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article