చంద్రగిరి:ఏ. రంగంపేట లోనిమోహన్ బాబు విశ్వవిద్యాలయంలో స్కూల్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్ మెంట్ పై అంతర్జాతీయ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ ను నావిగేటింగ్ ది ఫ్యూచర్ ట్రేండ్స్ అండ్ ర స్ట్రాట జీస్ ఫర్ సస్టైనబుల్ బిజినెస్ మేనేజ్ మెంట్ అనే అంశంపై సోమవారం నుండి బుధవారం వరకు మూడు రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం మోహన్ బాబు యూనివర్సిటీ రిజిస్టార్ డాక్టర్ కే.సారథి అధ్యక్షతన
ముఖ్యఅతిథిగా మద్రాస్ ఐఐటి మేనేజ్ మెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎల్. ప్రకాష్ సాయి, గౌరవ అతిథిగా తిరుపతిలోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ప్రొఫెసర్ భాను శ్రీ రెడ్డి పాల్గొన్నారు. వీరికి మోహన్ బాబు యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్ మెంట్ విభాగాధిపతి డాక్టర్ ఎం నరేష్ బాబు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎల్. ప్రకాష్ సాయి మాట్లాడుతూ కంపెనీలు పర్యావరణ మరియు సామాజిక బాధ్యతలతో స్థిరత్వం మరియు లాభదాయకతను సమతుల్యం చేసుకోవాలన్నారు. విజయం ఆవిష్కరణ, నియంత్రణ సమ్మతి మరియు వినియోగదారుల విశ్వాసంపై ఆధారపడి ఉంటుందన్నారు. అనంతరం భాను శ్రీ రెడ్డి మాట్లాడుతూ సస్టైనబుల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ పర్ పీపుల్, ప్లేస్ మరియు లాభదాయకతపై తన నైపుణ్యాన్ని పంచు కున్నారు. దీర్ఘకాలిక విజయాన్ని నిర్ధారించడానికి స్థిరమైన అభ్యాసాలను స్వీకరించడానికి కార్పొరేట్ పాలన మరియు కార్పొరేట్ సామాజిక బాధ్యత యొక్క అవసరాన్ని ఆమె నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో సదస్సు కన్వీనర్ డాక్టర్ డి వెంకటేష్, కో కన్వీనర్ డాక్టర్ ఎల్. కులదీప్ కుమార్, జాయింట్ కన్వీనర్ డాక్టర్ డి. కృపావతి తో పాటు వివిధ పాఠశాలల డీన్ లు, విభాగాధిపతులు, అధ్యాపకులు, పండితులు, విద్యార్థులు పాల్గొన్నారు.
