లేపాక్షి : మండల పరిధిలోని పి సడ్లపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శివాలయంలో పులమతి గ్రామ సర్పంచ్ అశ్వర్థ నారాయణ ఆధ్వర్యంలో సోమవారం మండల పూజలు ఘనంగా జరిగాయి. పి సడ్లపల్లి గ్రామంలో శివాలయం నిర్మించి 41 రోజులు పూర్తయిన సందర్భంగా ఆలయంలో నవగ్రహ హోమము, శాంతి హోమము నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు మహా పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో వందలాదిమంది భక్తు పాల్గొన్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదాన కార్యక్రమం జరిగింది.