మానవత్వం చాటుకున్న లేపాక్షి ఆలయ చైర్మన్
హిందూపురంటౌన్ :హిందూపురం పట్టణంలోని ఆబాద్ పేటకు చెందిన ఒంటరి మహిళ స్రవంతికి లేపాక్షి వీరభద్రాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కరణం రమానందన్ కుట్టు మిషన్ పంపిణీ చేశారు. ఆబాద్ పేటకు చెందిన స్రవంతి భర్తను కోల్పోయింది. బతుకు జీవనం కష్టమవడంతో విషయాన్ని రమానందన్ దృష్టికి తీసుకువచ్చారు. అందుకు స్పందించిన కరణం రమానందన్ ఒంటరి మహిళ స్రవంతికి కుట్టు మిషన్ ఇవ్వాలని నిర్ణయించారు. సోమవారం సాయంత్రం ఒంటరి మహిళ స్రవంతికి కుట్టు మిషన్ అందజేసి మానవత్వం చాటుకున్నారు. కుట్టు మిషన్ అందజేసిన వీరభద్రాలయ ధర్మకర్తల మండల చైర్మన్ రమానందన్ కు స్రవంతి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.