జగ్గంపేట :కాకినాడ జిల్లా జగ్గంపేటలో వాసవి ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ వి 210 జగంపేట క్లబ్ ఆధ్వర్యంలో ప్రతిరోజు నిర్వహిస్తున్న చలివేంద్రంలో ఆదివారం ఉదయం చల్లటి మజ్జిగ,చల్లటి తాగునీరు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిస్టిక్ ప్రోగ్రాం ఆఫీసర్ కొత్త వెంకటేశ్వరరావు (కొండబాబు) హాజరై చలివేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా పాదచారులకు,వాహనదారులకు, జగ్గంపేట మెయిన్ రోడ్ లోని వర్తక వ్యాపారస్తులకు చల్లటి మజ్జిగ మరియు త్రాగునీరు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మానేపల్లి బంగార్రాజు,మానేపల్లి రాజేష్,కొత్త నాగ పండు, ఎం రామాంజం,వి.గణేష్, వాసవి క్లబ్ ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు.