Thursday, November 13, 2025

Creating liberating content

తాజా వార్తలువిద్యతోనే సమాజాభివృద్ధి

విద్యతోనే సమాజాభివృద్ధి

హిందూపురం టౌన్ :హిందూపురం రూరల్ మండల పరిధిలోని చిన్నగుడంపల్లి లో ఉన్న ఉషోదయ విద్యాసంస్థల మొదటి వార్షికోత్సవం పట్టణంలోని వాల్మీకి భవన్ లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి గంగప్ప మాట్లాడుతూ, వైద్యరంగంలో దశాబ్ద కాలంగా సేవలు అందిస్తూ, మరొకవైపు రెండు విద్యాసంస్థల్లో నిర్వహించడం అభినందించదగ్గ విషయమని పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ శ్రీనివాసరెడ్డిని కొనియాడారు. విద్యా ,వైద్యం రెండు సమాజాభివృద్ధికి కీలకమని తెలియజేశారు. కళాకారుడిగా తనదైన శైలిలో విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపారన్నారు. విశ్రాంత ఉపాధ్యాయులు అంజన రెడ్డి మాట్లాడుతూ, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యా విధానంలో నూతనలో పోకడలు విద్యార్థులు అందిపుచ్చుకోవాలని అన్నారు. ఉపాధ్యాయులు ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, విలువలతో కూడిన విద్య, క్రమశిక్షణ అందిస్తున్నటువంటి యాజమాన్యాన్ని అభినందించారు. కరస్పాండెంట్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, వైద్య రంగంలో ఉన్నప్పటికీ అన్ని దానాల్లోకెల్లా విద్యాదానం గొప్పదని భావించి పట్టణం లోని పైపులైన్ రోడ్ , చిన్న గుడ్డం పల్లిలో రెండు విద్యాసంస్థలు నెలకొల్పి తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను అందిస్తున్నట్టు తెలిపారు. క్రమశిక్షణతో కూడిన విద్యను విద్యార్థుల్లో నైపుణ్యాలను గుర్తించి ఉన్నతంగా తీర్చిదిద్దడంలో మా ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిదని కొనియాడారు. ప్రిన్సిపాల్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, దాదాపు 400 మంది విద్యార్థులకు బోధన అందించడమే కాకుండా అర్హత అనుభవం కలిగిన ఉపాధ్యాయులతో బోధన కొనసాగిస్తూ తల్లిదండ్రుల ఆదరాభిమానాలు పొందుతున్న మా విద్యా సంస్థ గ్రామీణ ప్రాంతంలో తలమానికంగా నిలిచిందని తెలియజేశారు. డాక్టర్ కిరణ్మయిరెడ్డి మాట్లాడుతూ, ఇల్లాలు చదువు ఇంటికి వెలుగని, మగ పిల్లలతో పాటు ఆడపిల్లలు కూడా విద్యలో ప్రోత్సహించి వారి ఉన్నతికి తోడ్పడాలని తెలిపారు. ఆల్ అమీన్, వేణువిద్యా విహార్ కరస్పాండెంట్ లు రియాజ్, వేణు గోపాల్ మాట్లాడుతూ, సమాజంలో మార్పు విద్య ద్వారానే సాధ్యమని తెలిపారు .ఈ కార్యక్రమంలో విద్యార్థులచే నిర్వహించినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏవో అరుణ, నాగరాజారెడ్డి విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article