కదిరి :నల్లచెరువు మండల పరిధిలోని సంజీవపల్లి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు కుసుమాకర్ చౌదరి, మధుసూదన్ చౌదరిలు ఆదివారం సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి మండెం రవికుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు. వారికి ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బి.ఎస్ మక్బూల్ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గడచిన ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో పాటు చేసిన అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరిన వారికి తగిన గుర్తింపునిస్తామన్నారు. అదేవిధంగా సీఎం జగనన్న మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వారికి సూచించారు. అదేవిధంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ కదిరి ఎమ్మెల్యే అభ్యర్థి బి.ఎస్ మక్బూల్ నాయకత్వాన్ని బలపరుస్తామని, ఆయన గెలుపుకు అహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు.
బీజేపీని వీడి వైకాపాలో చేరిక:-
బీజేపీ మైనారిటీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి షారుఖ్ డిష్ చంద్ర పిలుపు మేరకు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బి.యస్. మక్బూల్ సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు మరికొందరు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరినవారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్ర భాస్కర్ రెడ్డి, కౌన్సిలర్ మురళీ, గంగాధర్ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి , వైకాపా యువ నాయకులు చిన్న రెడ్డెప్ప,అడ్వకేట్ విష్ణు వర్ధన్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

