గాజువాక:72వ వార్డు వైసిపి ఇన్చార్జ్ సిరట్ల శ్రీనివాస్ (వాసు) ఆధ్వర్యంలో అమర్నాథ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అపార్ట్మెంట్ వాసులు కిందికి దిగివచ్చి అమర్నాథ్కు హారతులు పట్టారు. ఆయన గెలుపు కోసం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కోసం మళ్లీ వైసీపీకే ఓటు వేస్తామని వారు భరోసా ఇచ్చారు. ఈ వార్డ్ లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం పెరుగుతుండటంతో కార్యకర్తలలో ఉత్సాహం ఉప్పొంగుతోంది.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, నియోజకవర్గం సిటి ప్రధాన కార్యదర్శి తిప్పలు దేవన్ రెడ్డి, ధనలక్ష్మి, విజయ, నాగమణి, పి.శ్రీనివాస్, రెడ్డి జగన్నాథం, రాజాన వెంకటరావు, రామకృష్ణ, రామి రెడ్డి, రమణ రెడ్డి, ఉరుకూటి అప్పారావు, సాయి, శ్రీనివాస రెడ్డి, హేమలత, మధు, దీప్తి, భవాని, వాసవి నాయుడు, మధుసూదన రెడ్డి, సంతోష్, జగన్, వరలక్ష్మి, జానకమ్మ తదితరులు పాల్గొన్నారు.

