కదిరి :స్థానిక మాజీ ఎమ్మెల్యే కందికుంట నివాసంలో బుధవారం తనకల్లు మండలం తవళం పంచాయతీ గందోడివారి పల్లి, సింగిరివాండ్ల పల్లికి చెందిన 30 కుటుంబాలు వైసీపీ పార్టీ ని వీడి కదిరి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ కందికుంట వెంకటప్రసాద్ సమక్షంలో పార్టీ లో చేరారు. పార్టీ లో చేరిన వారు గందోడి వారి పల్లి గ్రామస్తులు జి. రామచంద్ర, కే ఆంజనేయులు, కే సుధాకర్, ఈ .జనార్ధన, ఏ.రవి, హెచ్. ఆది, బి .హరి, ఎం. నాగమల్లు ఆర్. రమేష్, ఆర్. సోమశేఖర్, పి. దేవేంద్ర, ఎం. వెంకటరమణ, పాల వెంకటరమణ, ఏ. నరసింహులు, కే. హనుమంతు, సింగిరి వాండ్లపల్లి గ్రామస్తులు వి. రమణ, వి. నాగరాజు, పి. శ్రీనివాసులు, పి. శ్రీనివాసులు, పి. రామానుజులు, పి. వెంకటప్ప,కే. వెంకటస్వామి తదితరులను కండువాలు కప్పి సాధారంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తనకల్లు మండల నాయకులు రమణ సత్యనారాయణ కృష్ణారెడ్డి మాధవరెడ్డి చెన్నై కృష్ణ తదితరులు మండల నాయకులు పాల్గొన్నారు.