లేపాక్షి: మండల కేంద్రమైన లేపాక్షిలో నిర్వహిస్తున్న పదో తరగతి పరీక్షా కేంద్రాలను శ్రీ సత్యసాయి జిల్లా విద్యాశాఖ అధికారి మీనాక్షి మంగళవారం పరిశీలించారు. మండల కేంద్రమైన లేపాక్షి గురుకుల పాఠశాలలోని ఏ , బి కేంద్రాలను, ఓరియంటల్ ఉన్నత పాఠశాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న పదవ తరగతి పరీక్షలను జిల్లా విద్యాశాఖ అధికారి మీనాక్షి పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అవసరమైన నీరు, వైద్య సౌకర్యాలను కల్పించారా లేదా అని లేపాక్షి మండల విద్యాధికారి నాగరాజును అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు పరీక్షలు రాసేందుకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆమె ఆయా పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారులకు సూచించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు స్థానిక అధికారులు విద్యార్థులకు సహకరించాలని పేర్కొన్నారు. అనంతరం స్థానిక మండల రిసోర్స్ రిసోర్స్ కేంద్రంలో పలు రికార్డులను తనిఖీ చేశారు.