ఈ కార్పొరేషన్ అధికారులు ఇంతేనా .
ఇంకెంతమంది బలి కావాలి ఈ అధికారుల తీరుతో…
ఇదేనా వీరి వృత్తి ధర్మం…
బాధ్యత లేని పనులు చేయడమేల..బ్రతుకులు ఛిద్రం చేయడమేల…
ఈ అన్యాయపు పనులకు మూల్యం చెల్లించాల్సిదేవరు…
ఆ అకృత్యాల వెనుక నేతల ప్రమేయం…
అంతిమంగా ఎవర్నిబలి చేస్తారు…
ఇంకెన్నాళ్లీ దుర్మార్గం… ఏమిటీ వెకిలి పనులు…
ఈ ఇరువురి మధ్య నలిగిపోయేదెవరు…

విజయవాడ, ప్రధానప్రతినిధి :ఈ అవినీతి అధికారులు దనదాహానికి ఇంకెంతమందిని బలి చేస్తారో మరి. ప్రజల రక్తాన్ని జలగల్లా ఓ వైపు పీల్చుకుతింటూ కూడా ఇలాంటి పాడు పనులు చేయడం చూస్తే ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రజాస్వామ్య మా…లేక రాక్షస రాజ్యంలో బ్రతుకుతున్నామా అన్న మీమాంసకు దారీతీస్తున్నాయి.ఉద్యోగం రాకపోతే ఓ గోల వస్తే అవినీతికి అలవాటు పడి అన్యాయపు పనులు పాల్పడుతూ అక్రమాలకు నిలయం గా మారుతూ అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా ఉంటూ అమాయక ప్రజలు జీవితాలతో చెలగాటం ఆడే హక్కు ఎవరిచ్చారో ఈ దూరాఘత వ్యవస్థలో ఉన్న అవినీతి అధికారులకు.ఓ వైపు ప్రజాధనాన్ని దోచుకుంటూ ప్రజల మాన ప్రాణాలతో ఆడుకునే హక్కు రాజ్యాంగం లో కల్పించలేదే వీరికి.భారత రాజ్యాంగం లో పేద ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడమని చెప్పిందే తప్ప పాడు పనులు చేయమని ఎక్కడలేదే…ఈ ఆధునిక ప్రపంచంలో మనిషి మనుగడలో రోజు రోజు పరిణితి చెంది ప్రజలుకు ఉపయోగకరమైన పనులు చేయకుండా… ప్రజా జీవితాన్ని అస్తవ్యస్తం చేసేలా తప్పుడు విధానాలు అవలంబిస్తున్న ఈ అధికార వ్యవస్తను చూసి నివ్వెరపోతున్నది ఈ పుడమి తల్లి. ఇలాంటి దుస్థితి బెజవాడ కార్పొరేషన్ పరిధిలో చోటుచేసుకోవడం దారుణం.. ఇందుకు సంబంధించిన వివరాలోకి వెళితే…



కార్పొరేషన్ పరిధిలో ని గుణదల ప్రాంతములో 113/3గల సర్వే నంబర్ లో దేవినేని శ్రీహరికి ఒక ఎకరం 16 సెంట్ల స్థలం ఉంది…అదే స్థలానికి ముందు వైపు slv నిర్మాణ సంస్థ ఓ బహుళ అంతస్తును నిర్మించి విక్రయాలు చేశారు.. చేస్తూ ఉన్నారు… అయితే ఇక్కడ అసలైన సమస్య మొదలైనది…బహుళ నిర్మాణాలు చేపట్టిన slv అధినేత తనకు ఉన్న కాళీ స్థలం కొంత మేర అక్రమించాడని ఆరోపణలు చేస్తూ అధికారుల చుట్టూ తిరిగి వేసారిపోయి..ఆఖరికి కోర్టులను సైతం ఆశ్రయించి న్యాయ పోరాటం చేస్తున్నాడు… ఈ న్యాయ పోరాటంలో తనకు తన కుటుంబానికి కూడా ప్రమాదం ఉందని ఆరోపణలు చేస్తూ తన హక్కులకోసం అలుపెరుగని పోరాటం చేస్తూ ఇక అలసిపోయాను…నాకు న్యాయం దక్కుతుంది అయితే ఆ న్యాయం అందెలోగా ఆక్రమణ జరిగిపోతుందనే ఆవేదనను వ్యక్తం చేస్తున్నాడు దేవినేని శ్రీహరి ..పోలీసులు, రెవెన్యూ, కార్పొరేషన్ అధికారులు అవినీతి,అక్రమాలు,తప్పిదంతో తన ఆస్తి నష్టపోయే పరిస్థితి ఉందని శ్రీహరి ఆవేదన వెలిబుచ్చుతున్నాడు..అందులో భాగంగా సోమవారం శ్రీవారి కాళీ స్థలంలో మిషన్లతో గుంటలు తీయిస్తుంటే అక్కడ slv అధినేత వర్గానికి శ్రీహరి వర్గానికి మధ్య యుద్ధ వాతావరణ మే జరుగుతున్న తీరు దర్శనమిచ్చింది…ముందస్తు సమాచారం మేరకు పోలీసు బందోబస్తు మధ్య పర్యవేక్షణ ఏర్పాటు చేశారు.అయితే ఈ వివాదంపై అక్కడ ఉన్న బిల్డింగ్ యజమానులు,slv అధినేత కు సంబంధించిన వారు శ్రీహరి వాదనను కొట్టి పారేస్తున్నారు…అన్నీ అనుమతుల ప్రకారమే నిర్మాణం చేపట్టారని ఎక్కడ అక్రమణ జరగలేదని చెప్పుకొస్తున్నారు…అయితే ఎవరిది అన్యాయం ఎవరిది న్యాయం అని నిగ్గు తేల్చాల్సిన అధికారులు కచ్చితమైన విధి విధానాలు పాటించకపోవడం వల్లే ఐలాంటి పరిస్థితి దాపరించదని అక్కడి వారు వాపోతున్నారు.. మరి కార్పొరేషన్ అధికారులు ఎవరికీ కొమ్ము కాస్తారో లేక నిజాన్ని నిర్భయంగా నిగ్గుతేల్చుతారో వేచిచూద్దాం…

