కడప సిటీ :మార్చి 25 సోమవారం సాయంత్రం కడప జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కడపలో అమీన్ ఫంక్షన్ ప్యాలెస్ నందు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ షర్మిల రెడ్డి గారు హాజరవుతారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను శుక్రవారం మాజీ రాజ్యసభ సభ్యులు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మీడియా చైర్మన్, డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డిఇతర కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా తులసి రెడ్డి మాట్లాడుతూ రంజాన్ ముస్లింల పవిత్ర పండుగని, రంజాన్ మాసంలోనే పవిత్ర గ్రంథం ఖురాన్ అవతరించిందన్నారు. నమాజు, రోజా, జకాత్ ,ఇఫ్తార్లు రంజాన్ మాసంలో ముఖ్యమైన కార్యక్రమాలున్నారు. రోజా అంటే ఉపవాసమని ఉపవాసం వల్ల ఎదుటివారి ఆకలిని గుర్తించడం జరుగుతుందని అన్నారు. దీనివలన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అదుపులో ఉంటాయని అన్నారు. ఇఫ్తార్ విందు ఇచ్చిన వారికి తీసుకున్న వారికి పాపాలు తో లుగుతాయని అన్నారు. ఏర్పాట్లను పరిశీలించిన వారిలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు నజీర్ అహ్మద్ పిసిసి ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సత్తార్, కడప నగర కాంగ్రెస్ అధ్యక్షులు విష్ణు ప్రితమ్ రెడ్డి, సంఘ సేవకుడు సలావుద్దీన్, లయన్ పి.ఖాసింఖాన్, ఆడిటర్, మాజీ డిప్యూటీ మేయర్ అరిఫుల్ల సుజాత్ అలీ ఖాన్, అష్రఫ్ అలీ ఖాన్, ఖాదర్ బాషా, మోపూరు వెంకటరమణారెడ్డి, మూలంరెడ్డి ధ్రువ కుమార్ రెడ్డి, మల్లెం విజయ భాస్కర్, ప్రసాద్ బాబు అమర్ సుబ్బరాయుడు నరసింహారెడ్డి వినయ్ రాజా తదితరులు పాల్గొన్నారు.
