రాబోయే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి అన్నా విజయానికి కృషి చేస్తాము
మార్కాపురం :మార్కాపురం మండలంలోని రాయవరం స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న టీడీపీకి చెందిన 25 కుటుంబాల వారు మార్కాపురం నియోజకవర్గ వైస్సార్సీపీ అభ్యర్థి అన్నా రాంబాబు సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు. గురువారం మార్కాపురం జవహర్ నగర్ లోని ఎమ్మెల్యే అన్నా నివాసంలో వారు ఎమ్మెల్యే అన్నా ను కలిసి మద్దతు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా పార్టీలో చేరిన వారికీ కండువాలు వేసి పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా పార్టీ లో చేరిన వారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో మార్కాపురం నుండి పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి అన్నా రాంబాబు ని, ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి బాస్కర్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీ తో గెలిపించేలా కృషి చేస్తామన్నారు. పార్టీలో చేరిన వారిలో గోగుల ఏడుకొండలు, నందిని, బత్తుల కృష్ణారెడ్డి, బండారు నాగయ్య, బత్తుల తిరుపతమ్మ, ఈర్ల రామ లక్ష్మమ్మ, గుంజా నాగేశ్వరమ్మ లు ఉన్నారు.*