వేలేరుపాడు :రానున్న ఎన్నికల్లో బిజెపిని, దాని అనుబంధ కూటమిని చిత్తుగా ఓడించాలని ప్రజాపందా నాయకులు పిలుపునిచ్చారు, స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ,
అసెంబ్లీ ఎన్నికల్లో పోలవరం నియోజగవర్గం నుండి పోటీ చేస్తున్న న్యూడెమోక్రసీ అభ్యర్థికి ప్రజాపంధా మద్దతు ఇస్తామని,
రానున్న పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు ఎంతో కీలకమైన ఎన్నికలని, దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని, అందుకే ఎన్నికలకు మతవాద బిజెపి, ఆర్ఎస్ఎస్ పార్టీని దానికి ప్రత్యక్ష పరోక్ష భాగస్వాములైన వారిని ఓడించాలని సిపిఐ ఎంఎల్ మాసలైన్ జాతీయ సహాయ కార్యదర్శి పోటు రంగారావు, ఆల్ ఇండియా నాయకులు కెచ్చల రంగారెడ్డిపిలుపునిచ్చారు. భారతదేశం విభిన్న జాతులు మతాలు కలవని, పరమత సహనం తరతరాల జీవన విధానం దానిని,బిజెపి మతోన్మాద స్థాపనకు పూనుకున్నారని విమర్శించారు.
అదే విధంగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోలవరం నియోజకవర్గ నుంచి పోటీ చేస్తున్న సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ అభ్యర్థికి సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజా పంథా మద్దతిస్తుందని తెలియజేశారు.
ఏపీ లోచంద్రబాబు కూటమి, జగన్ పార్టీ ఇరువురు, భయపడి బిజెపి తో జత కట్టారని విమర్శించారు, ఇది విషాదకరమైన పొత్తుగా పేర్కొన్నారు, ప్రాంతీయ పార్టీలను, ప్రతిపక్షాలను ధ్వంసం చేస్తున్న బిజెపి తోడుమిత్రులుగా ఉండటం ప్రజా వ్యతిరేక ధోరణి అని అన్నారు.
ఈ సమావేశంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్,రాష్ట్ర నాయకుల షేక్ గౌస్,కెచ్చల కల్పన,జిల్లా నాయకులు సిరికొండ రామారావు,బాసిన సత్యనారాయణ,ముత్యాలరా వు,డివిజన్ నాయకులు కే వీరస్వామి,కే ముత్యాలరావు, సోయం చందర్రావు,కే కన్నయ్య మల్లేష్,ఎంపీటీసీ కే రత్తమ్మ, సర్పంచ్ సోడే విజయ, పిఓడబ్ల్యు నాయకురాలు ఎస్కే.మున్ని తదితరులు పాల్గొన్నారు.