కామవరపుకోట :స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నేడు తెలుగు విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ కవితా దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె విజయబాబు ప్రసంగిస్తూ మనిషిని, మనసును కదిలింప చేసే శక్తి అక్షరాలకు ఉంది అని పేర్కొంటూ సామాజిక పరివర్తనకు కవితలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. తెలుగు అధ్యాపకుడు డాక్టర్ జి శ్రీనివాసరావు ప్రసంగిస్తూ మనిషిలో సృజనాత్మకతను మరియు నైతిక విలువలను పెంపొందించడానికి కవితల అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. విద్యార్థులచే కవిత్వ పఠనం చేయించి ప్రిన్సిపాల్ చే బహుమతి ప్రదానం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ కె విజయబాబు, తెలుగు అధ్యాపకుడు డాక్టర్ జి శ్రీనివాసరావు, ఎం ఉషారాణి, కె ఇందిరా కుమారి, వి శ్రీనివాస్, ధారావతు మల్లేష్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.