Friday, September 12, 2025

Creating liberating content

తాజా వార్తలుధర్మయుద్ధంలో వైసీపీదే విజయం-రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి

ధర్మయుద్ధంలో వైసీపీదే విజయం-రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి

కదిరి :రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ఆపాలన్న కక్షతో జత కట్టిన కౌరవ సంఘం ఒకవైపు, రాష్ట్ర ప్రజల కోసం పోరాడుతున్న పాండవ సైన్యం మరోవైపు అనే విధంగా ధర్మ యుద్ధం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం ఆపార్టీ కదిరి ఎమ్మెల్యే అభ్యర్థి బి.ఎస్ మక్బూల్ ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కదిరి నియోజకవర్గంలో గతంలో కంటే ఈసారి అత్యధిక మెజారిటీతో తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఆయన మాటల్లోనే.. “రాజకీయ పార్టీలతో పాటు నాయకులకు ఉండవలసిన విలువలను చూపించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. కార్యకర్తలు నాయకుడి గొప్పతనాన్ని చెప్పుకోగలిగిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కైన చంద్రబాబు నాయుడు ఎన్ని ఇబ్బందులు, వేధింపులకు గురిచేసినా నా పొత్తు ప్రజలతోనేనని వ్యక్తిగత జీవితం కోసం రాజీపడనని చెప్పిన ధైర్యశాలి మా నాయకుడు. ఐదేళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోదీని టెర్రరిస్ట్ గా చూపించిన చంద్రబాబు నాయుడు నేడు ప్రపంచానికి గురువు అని చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక భయపడుతున్న చంద్రబాబు ఏ అజెండా లేని జెండాలన్నింటినీ కలుపుకొని కూటమి కట్టారు. ఆంధ్రుల ఆత్మగౌరవం అంటూ ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని చంద్రబాబు నాయుడు ఢిల్లీలో అమిత్ షా ఇంటి గేటు ముందు తాకట్టు పెట్టారు. కార్యకర్తలు పార్టీ యొక్క గొప్పతనాన్ని గర్వంగా చెప్పుకునే విధంగా నాయకుడి ప్రవర్తన ఉండాలి 99.9 శాతం హామీలను నెరవేర్చి ఇంటింటికి వెళ్లి పథకాలు అందాయా లేదా అని ఎమ్మెల్యేల ద్వారా అడిగించిన ఘనత మా ముఖ్యమంత్రికే దక్కుతుంది. రాష్ట్రంలోని ప్రతి పౌరుడిని మీకు మంచి జరిగింటేనే నాకు ఓటు వేయండి అని అడిగిన దమ్మున్న నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి. అదే 2014లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చానని చెప్పి ఓటు అడిగే ధైర్యం మీకు ఉందా? దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు చెప్పగానే ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, ఫీజు రీ యింబర్స్మెంట్ వంటి పథకాలు గుర్తొస్తే.. వైయస్ జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పగానే సచివాలయం, వాలంటీర్ల వ్యవస్థతో పాటు ఆసరా వంటి ఎన్నో పథకాలు గుర్తొస్తాయి. అదే మీ 14 సంవత్సరాల ముఖ్యమంత్రి పాలనలో చెప్పుకోవడానికి ఒక పథకమైన ఉందా అని ప్రశ్నిస్తున్నాను. ఓవైపు 175కు 175 స్థానాల్లో పోటీ చేసి గెలుస్తామని ధీమాగా చెబుతున్న మా నాయకుడు ధైర్యం ముందు 130, 140 స్థానాలకు తన్నుకుచస్తున్న మీరు జగన్మోహన్ రెడ్డి అంతు చూస్తామని ప్రగల్బాలు పలుకుతున్నారు. ప్రపంచానికి గురువులని చెప్పుకొనే నేషనల్ పార్టీ నాయకులు ఈరోజు ఆరు సీట్లకి రాజీపడి ప్రాంతీయ పార్టీకి తోక పార్టీలాగా మారిన మీరా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేది. కదిరి వైసీపీ అభ్యర్థి బి.ఎస్ మక్బూల్ కు సీఎం జగనన్నతో పాటు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవకాశం కల్పించారు. ప్రతి ఒక్కరూ ఆయన విజయం కోసం కృషి చేస్తాం. అందుకు అందరి సహకారం కావాలి” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్ర భాస్కర్ రెడ్డి, రాష్ట్ర సీఈసీ సభ్యులు పూల శ్రీనివాసరెడ్డి, మాజీ సమన్వయకర్త ఎస్ఎండీ ఇస్మాయిల్, వైసీపీ నాయకులు పరికి సాదిక్ బాషా, సాదత్ అలీ ఖాన్, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ మండలాల వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article