బద్వేల్ :బద్వేల్ నియోజకవర్గం గోపవరం మండలంలో ఇల్లు లేని నిరుపేదలు పి పి కుంట వద్ద సర్వే నెంబరు 15 64 నందు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గుడిసెలు వేసుకుని అక్కడే స్థిర నివాసం ఉంటూ జీవిస్తున్నారని అలాంటి వారిపై గోపవరం తాసిల్దార్ అధికార పార్టీ నాయకులకు అమ్ముడుపోయి, ఒత్తిళ్లకు గురై సమస్యను పరిష్కరించాల్సింది పోయి గుడిసె వాసులను భయభ్రాంతులకు గురి చేస్తూ జెసిబిలను తీసుకెళ్లి కూల్చే ప్రయత్నం చేయగా అక్కడ ఉన్న మహిళలు తిరగబడితే వారిపై దాడి చేయించడం సిగ్గుచేటని, విఆర్ఓ వెంకటేశ్వర్లు వంట చేసుకుని గ్యాస్ సిలిండర్ సైతం ఎత్తుకెళ్లి జీబులో వేయడం సరికాదని నిజంగా రెవిన్యూ అధికారులకు చిత్తశుద్ధి ఉంటే వారి కార్యాలయం నుంచి సర్వే ప్రారంభించి కుంట వద్ద ఉన్న భూమి కబ్జాకు గురయ్యాయని వాటిని స్వాధీనం చేసుకోవాలని పేదల జోలికి రావద్దని అక్కడనుండి కదిలేది లేదని సిపిఐ భూ పోరాట కమిటీ కన్వీనర్ పీవీ రమణ హెచ్చరించారు ఈ ధర్నా లో మండల కార్యదర్శి పెంచలయ్య, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి షేక్ ఖాదర్ బాషా, అఖిలభారత యువజన సంఘం నాయకులు బండి అనిల్ కుమార్, భూ పోరాట కమిటీ సభ్యులు కిరణ్ ,నరసింహ ప్రతాప్, ఓబులమ్మ, లక్ష్మమ్మ వెంకటయ్య ప్రభాకర్, నాగరాజు సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు