మీ సేవకుడిగా ఉంటా..ఆశీర్వదించండి
శింగనమల నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు.

పుట్లూరు. నియోజకవర్గ వ్యాప్తంగా సాగిన పర్యటన..గ్రామాల్లో నీరాజనం పలికిన ప్రజలు నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తనలాంటి సామాన్య కార్యకర్తను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా నమ్మకంతో అవకాశం కల్పించారని, రానున్న ఎన్నికల్లో ఆశీర్వదించి గెలిపిస్తే ప్రజలకు సేవకుడిగా ఉంటానని వీరాంజనేయులు అన్నారు.
పుట్లూరు మండలం ఏ.కొండాపురం, అరకటవేముల, సూరేపల్లి, కడవకల్లు, సంజీవపురం, ఓబుళాపురం, దోసలేడు, చెర్లోపల్లి, చాలవేముల, గ్రామాల్లో పార్టీ నాయకులతో కలసి వీరాంజనేయులు పర్యటించారు.
గ్రామాల్లో వైఎస్ఆర్సిపి శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకుల ఇళ్లకు వెళ్లి పలకరించారు. గ్రామాల్లో ప్రజలను ఆప్యాయంగా పకరిస్తూ, సంక్షేమ పథకాలు వివరించారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా జగనన్న అవకాశం కల్పించారని, రానున్న ఎన్నికల్లో “ఫ్యాన్” గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించి, సేవ చేసుకునే భాగ్యం కల్పించాలని ప్రజలను కోరారు.
వీరాంజనేయులు మాట్లాడుతూ.. పేదలు, పెత్తందారులకు మధ్య జరిగే ఎన్నికల యుద్ధంలో జగనన్న సంక్షేమ పథకాలే విజయానికి అస్త్రాలన్నారు. ప్రతి ఎన్నికల్లో అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేస్తూ అడ్డదారిలో అధికారంలోకి రావాలని కుటిల యత్నాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు ప్రయత్నాలను ప్రతి ఒక్కరు తిప్పి కొట్టాలన్నారు. రాజకీయాల్లో 45 ఇయర్స్ ఇండస్ట్రీ అని గొప్పలు చెప్పుకొనే చంద్రబాబుకు జగనన్న భయం పట్టుకుంది కాబట్టే ఒంటరిగా పోటీ చేయడం చేతకాక కూటమి ఏర్పాటు చేసుకున్నారని అపహాస్యం చేశారు. రాష్ట్రాన్ని దోచుకోవాలనే ఆలోచన తప్పితే ప్రజలకు మంచి చేయాలని స్పృహ బాబు కు లేదని విమర్శించారు.
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో అందించిన సంక్షేమ పాలనతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. సీఎం గా బాధ్యత చేపట్టినప్పటి నుంచి సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేశారన్నారు. కరోనా కష్టకాలంలో రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఇచ్చిన హామీ నెరవేర్చడంతోపాటు పేదలకు నేనున్నా..అన్న భరోసా కల్పించి వారి ప్రాణాలు కాపాడారని గుర్తు చేశారు. జగనన్న పాలనలో అమలైన సంక్షేమ పథకాలు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించారన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ, రంగాలకు పెద్దపీట వేశారన్నారు. జగనన్న చెప్పిందే చేస్తారని, చేయగలిగింది చెప్తారని స్పష్టం చేశారు.
నియోజకవర్గ వ్యాప్తంగా ఆరు మండలాల పరిధిలోని ప్రతి గ్రామాల్లోని ప్రజలు అడుగడుగునా నీరాజనం పలికారు. ప్రతి గడపకు వెళ్లి వైఎస్సార్సీపీ నాయకులను, ప్రజలను పలకరించారు. ఆత్మీయ పలకరింపు పర్యటనను విజయవంతం చేసిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి, అభ్యర్థి ఎం. వీరాంజనేయులు ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ భూమిరెడ్డి రాఘవరెడ్డి, జడ్పిటిసి, సర్పంచులు, మండల కన్వీనర్, వైయస్ఆర్ సీపీ నాయకులు సుబ్రహ్మణ్యం, వీర శేఖర్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, హరినాథ్ రెడ్డి,నాగభూషణం, నాగ ముని, వైయస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు
