వరుపుల సుబ్బారావు ఎమ్మెల్యేగా విజయం సాధించాలని….సర్పంచ్ రామకృష్ణ పాదయాత్ర శంఖవరం: ప్రత్తిపాడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే , వైసీపీ ఇంచార్జ్ వరుపుల సుబ్బారావు రెండు నెలల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో సత్తెమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో ఎమ్మెల్యే గా విజయం చేకూర్చాలని రౌతులపూడి మండలం గుమ్మరేగుల సర్పంచ్ రాపర్తి రామకృష్ణ తన అనుచరులతో గురువారం గుమ్మరేగుల గ్రామం నుంచి చేబ్రోలు సత్తెమ్మ తల్లి గుడి వరకు పాదయాత్ర చేపట్టారు.శంఖవరం చేరుకున్న పాదయాత్రలో మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు , శంఖవరం ఎంపీపీ పర్వత రాజబాబు పాల్గొన్నారు .శంఖవరం లో దివంగత నేత రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని కి వరుపుల పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం పాదయాత్ర చేపట్టిన రామకృష్ణ ను శాలువతో సత్కరించి పుష్ప గుచ్ఛం అందించి అభినందించారు.ఈ సందర్భంగా సర్పంచ్ రాపర్తి రామకృష్ణ మాట్లాడుతూ త్వరలో రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గా జగన్మోహన్ రెడ్డి, కాకినాడ ఎంపీగా చలమలశెట్టి సునీల్, ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా వరుపుల విజయం సాధించాలని సత్తెమ్మ తల్లి అమ్మవారి ని వేడుకునానన్ని దీనిలో భాగంగా నే ఈ రోజు 25 కిలో మీటర్లు పాదయాత్ర చేపట్టడం జరిగిందని అన్నారు.గతంలో వరుపుల సుబ్బారావు ఎమ్మెల్యే గా విజయం సాధించాలని రౌతులపూడి శివాలయం నుండి గుమ్మరేగుల వరకు పాదయాత్ర చేపట్టడం జరిగిందని అన్నారు. పాదయాత్ర లో పాల్గొన వరుపుల సుబ్బారావు మాట్లాడుతూ సిఎం జగన్ రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండిందని, ఆయన సంక్షేమ పథకాలే మా విజయాన్ని కి శ్రీరామ రక్షగా నిలుస్తున్నాయని అన్నారు. ఎంపీపీ పర్వత రాజబాబు మాట్లాడుతూ నియోజకవర్గానికి జగన్ పంపిన నేత వరుపుల సుబ్బారావని , వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జనం మెచ్చిన నేతగా పేరు తెచ్చుకున్న వరుపులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పర్వత సత్యనారాయణ మూర్తి, పులి మధు, చెన్నాడ సత్తిబాబు, వాసిరెడ్డి జమీలు, పర్వత వివేక్, బొమ్మిడి చిట్టిబాబు, పడాల సతీష్, బోణం ఫణి, పెనుపోతుల శివ, కుర్రె దొరబాబు, కర్రి రాము ఇతర నాయకులు పాల్గొన్నారు.
