ముచ్చటగా మూడోసారి విజయం మనదే
- బాలయ్య ఘన విజయం తథ్యం
- అభివృద్ధి పనులే గెలిపిస్తాయి
- నందమూరి వసుంధర ధీమా
హిందూపురo :వచ్చే ఎన్నికల్లో కూడా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయాన్ని ఎవరు ఆపలేరని.. ముచ్చటగా మూడవసారి నందమూరి బాలకృష్ణ గెలిచి హ్యాట్రిక్ సాధిస్తారని నందమూరి వసుంధర ధీమా వ్యక్తం చేశారు. ముద్దిరెడ్డిపల్లి.. పోచనపల్లి తదితర ప్రాంతాల్లో జరిగిన వివిధ కార్యక్రమాల్లో వసుంధర విస్తృతంగా పాల్గొన్నారు. ముద్దిరెడ్డిపల్లి పరిధిలోని దండు రోడ్డులో సిసి రోడ్డు నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. అదేవిధంగా ముద్దిరెడ్డిపల్లి, పోచంపల్లిల్లో శుద్ధి జలాల తాగునీటి ప్లాంట్లను ప్రారంభించారు. ఆయా కార్యక్రమాలను సొంత నిధులతో చేపట్టారు. ఈ సందర్భంగా వసుంధర మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంటున్న హిందూపురం మళ్లీ రికార్డు కొనసాగిస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో తన భర్త నందమూరి బాలకృష్ణ విజయాన్ని ఏ శక్తి అడ్డుకోలేదన్నారు. రికార్డు మెజార్టీతో బాలయ్య విజయం తథ్యమన్నారు. రాష్ట్రంలో టిడిపి బిజెపి జనసేన పొత్తు సఫలమవుతుందన్నారు. ఆయా కార్యక్రమంలో టిడిపి నేతలు అంబికా లక్ష్మీనారాయణ, రావిళ్ళ లక్ష్మి, గ్రీన్ పార్క్ నాగరాజ్, డి రమేష్ కుమార్, బెవనహళ్లి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు