వేంపల్లె:అంగన్వాడీ కార్యకర్తలకు పెండింగ్లో ఉన్న మూడు నెలల వేతనాలు తక్షణమే విడుదల చేయాలని ఏఐటియుసి జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రటరీ కేసి.బాదుల్లా డిమాండ్ చేశారు.బుధవారం స్థానిక వేంపల్లి మండల కేంద్రంలోని ఎస్టీయు కార్యలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాదుల్లా మాట్లాడుతూ జగనన్న సంపూర్ణ పోషణ ప్రీస్కూల్ పిల్లలకు పాలు, బియ్యం, నూనె, కందిపప్పు, గ్రుడ్లను ప్రభుత్వం రెండు నెలలుగా అంగన్వాడి సెంటర్లకు సరుకులు సక్రమంగా అందించడం లేదని దీనివలన సెంటర్స్ లో పిల్లలకు ఏమి వండి పెట్టాలో తెలియని పరిస్థితుల్లో అంగన్వాడి టీచర్స్ ఉన్నారని తెలిపారు. సమ్మె కాలంలో ఇస్తామన్న వేతనం తక్షణమే ఇవ్వాలని గత మూడు నెలలుగా పెండింగ్లో ఉన్న అద్దె బకాయిల బిల్లులను తక్షణమే అకౌంట్లో జమ చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో ఏఐటియుసి నాయకులు బళ్లారపు రామాంజనేయులు, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.